Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ ‘పెద్ద’నిర్ణయానికి 80శాతం ప్రజల మద్దతు: సీ ఓటర్ సర్వే

న్యూఢిల్లీ: దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న రాత్రి రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతి రోజు బ్యాంకులు, ఏటీఎంలు మూసివేయబడ్డాయి. ఒక రోజు తర్వాత బ్యాంకులు, రెండ్రోజుల తర్వాత ఏటీఎంలు తెరుచుకున్నాయి.

కొత్త నోట్ల రాక ఆలస్యం, పాత నోట్ల అందుబాటులో లేని కారణంగా ప్రజలు వందనోట్లు, చిల్లర కోసం చాలానే ఇబ్బందులు పడ్డారు. అయినా, ప్రజలు దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న మోడీ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఎన్ని ఇబ్బందులెదురైనా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారే తప్ప ఆందోళనలకు దిగలేదు. దేశంలోని 80శాతానికిపైగా మంది మోడీ నిర్ణయానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు సీ ఓటర్ పోల్ తన నివేదికను వెలువరించింది.

అంత‌ర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ సీ-ఓట‌ర్ దేశవ్యాప్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో మెజారిటీ ప్ర‌జ‌లు మోడీ నిర్ణ‌యానికి అనుకూలంగా ఓటేశారు. 'నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే. అయినా ఏం ప‌ర్వాలేదు. న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని ప్ర‌క‌టించిన యుద్ధానికి మా మ‌ద్ద‌తు ఉంటుంది' అని దేశంలోని 80-86 శాతం మంది ప్ర‌జ‌ల అభిప్రాయపడ్డారు.

Over 80 percent don’t mind inconvenience of demonetisation, says C-Voter poll

స‌ర్వేలో పాల్గొన్న గ్రామీణ‌ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివసిస్తున్న 86 శాతం మంది నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్త‌వ‌మేన‌న్నారు. మోడీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించిన వారిలో చాలామంది అధిక ఆదాయం క‌ల‌వారే. నోట్ల ర‌ద్దు చాలా మంచి నిర్ణ‌య‌మ‌ని, చ‌క్క‌గా అమ‌లు చేస్తున్నార‌ని స‌ర్వేలో పాల్గొన్న వారిలో అధిక‌శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో 71 శాతం మంది ఇదే విధ‌మైన అభిప్రాయం వెల్ల‌డించ‌గా, సెమీ అర్బ‌న్ ప్రాంతాల వారు 65.1 శాతం, సెమీ రూర‌ల్ జోన్స్‌లో 59.4 శాతం మంది నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 23.8 శాతం, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో 24.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని అంగీక‌రించారు. నిర్ణ‌యం మంచిదే అయినా అమ‌లులో లోపాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు నోట్ల ర‌ద్దుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్న‌వ‌ని వాటి నుంచి తేలిగ్గానే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని చాలామంది తెలిపారు. ఈ అభిప్రాయం వెల్ల‌డించిన వారిలో 38 శాతం మంది అర్బ‌న్ ప్రాంతాల‌కు చెందిన‌వారు కాగా 35.5 శాతం మంది సెమీ అర్బ‌న్‌, 36.8 శాతం మంది గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన‌వారున్నారు.

న‌ల్ల‌ధ‌నంపై యుద్దానికి నోట్ల ర‌ద్దు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంద‌ని 86 శాతం మంది ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు, 80.6 శాతం మంది సెమీ అర్బ‌న్, 86 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. వీరిలో 83.7 శాతం మంది అతి త‌క్కువ ఆదాయం క‌లిగిన వారు కాగా 84.4 శాతం మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు. 90.6 శాతం మంది అధికాదాయ వ‌ర్గాలవారు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+