సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు
విశ్వంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. మనిషి తన జీవితకాలంలో ఏనాడూ చూడని మహాద్భుత దృశ్యం అది. చందమామకు అవతలి వైపు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దీన్ని ఆర్టెమిస్ 2 వ్యోమగాములు స్వయంగా వీక్షించారు. మనం రోజూ చూసే చంద్రుడికి ఇవతలి వైపు కంటే ఎంతో భిన్నంగా కనిపించిందా సూర్యగ్రహణం. ఇక్కడి కంటే సుదీర్ఘ గ్రహణ కాలం అది. గ్రహణం చీకటిలో ఆర్టెమిస్ 3 నౌక ప్రయాణం ప్రారంభమైందంటే అది ఎంత భిన్నమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టెమిస్ 2 వ్యోమగాములు ప్రస్తుతం చంద్రుడికి వెనుకవైపు ఉన్నారు. వారు బయలుదేరిన ఓరియన్ స్పేస్ షిప్ ప్రస్తుతం చంద్రుడికి అవతలి వైపున పరిభ్రమిస్తోంది. అదే సమయంలో ఈ అత్యంత అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్షీభూతంగా నిలిచింది. భూమిపై ఎవరూ, ఎప్పుడూ చూడలేని సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఆ నలుగురు వ్యోమగాములు వీక్షించారు. ఒరియన్ అంతరిక్ష నౌక చంద్రుని వెనుకకు జారుకోవడంతో గ్రహణం చీకటిలో దాని ప్రారంభమైంది.

ఇప్పుడు ఈ ఆర్టెమిస్ 2 వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై తుది సన్నాహాలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ నెల 11 తెల్లవారు జామున 5:37 నిమిషాలకు పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ స్ప్లాష్‌డౌన్ అవుతుంది. స్ప్లాష్ డౌన్ సమయంలో ఈ ఓరియన్ క్యాప్సుల్.. అపోలో 10 నెలకొల్పిన అంతరిక్ష వేగ రికార్డును బద్దలు కొట్టే అవకాశం దాదాపుగా లేదు.
నాసా అంచనాల ప్రకారం గరిష్టంగా సెకనుకు 38,367 కిలోమీటర్ల వేగంతో ఆర్టెమిస్ 2 ఓరియన్ క్యాప్సుల్ తిరిగి భూ కక్ష్యలోకి ప్రవేశించవచ్చు. ఇది అపోలో 10 రికార్డు గరిష్ట వేగం 39,938 కిలోమీటర్ల కంటే తక్కువ. 11వ తేదీన తెల్లవారు జామున 5:23 నిమిషాలకు ఈ క్యాప్సుల్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. 14 నిమిషాల తర్వాత శాన్ డియాగో తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్ అవుతుంది. నలుగురు వ్యోమగాములను సురక్షితంగా వెలికి తీసి, వైద్య పరీక్షల కోసం తరలిస్తారు.
ఓరియన్ వ్యోమగాములు రీఎంట్రీని నాసా నిర్ధారించింది. స్పేస్ షిప్ కమాండర్ రీడ్ వైస్‌మ్యాన్ తో సంప్రదింపులు జరిపింది. చివరి అంతరిక్ష టెస్టింగ్ సెషన్‌ను పూర్తి చేసినట్లు ఆయన నాసాకు తెలియజేశారు. సూక్ష్మగురుత్వాకర్షణ ప్రభావాల నివారణకు ఇది తప్పనిసరి. ఈ మిషన్‌లో ఇది ఫైనల్ టెస్ట్ అవుతుందని వైస్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. క్రూ మొత్తం కూడా భూమికి తిరిగి వచ్చే దశలో ఉన్నారని పేర్కొన్నారు.
భూ కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు ఓరియన్ దాదాపు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో క్యాప్సుల్ లో ఉండే కొన్ని పరికరాలు వదులు కావడాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీనికోసం రేడియేషన్ షీల్డింగ్ అవసరం. ఈ క్రమంలో ల్యాండింగ్‌కు ముందు వ్యోమగాములు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి రేడియేషన్ షీల్డింగ్ విధానాలను అడిగి తెలుసుకుంటారు.
-
అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications