today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?
నేడు ఏప్రిల్ 8బుధవారం.. నేడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులవారి జీవితాలలో ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు చంద్రుడు తన సంచారంతో భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాడు. సూర్యుడు మీనరాశిలో కొనసాగుతూ ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికతను పెంచుతాడు. బుధుడు, శుక్రుడు తమ తమ స్థానాల్లో ఉండి కమ్యూనికేషన్, సంబంధాలపై ప్రభావం చూపుతారు. నేడు ద్వాదశ రాశులవారు ముఖ్య గ్రహాల సంచారంతో ప్రభావాన్ని చూస్తారు. అమరి ఆ రాశులేమిటో ఒకసారి చూద్దాం.
మేషరాశి
మేషరాశి జాతకులకు నేడు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆచి తూచి అడుగు వెయ్యాలి.
మిథునరాశి
నేడు మిథునరాశి వారికి స్నేహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఇది వీరికి మంచి కాలం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశి వారికి నేడు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వీరికి నేడు అదృష్టం కలిసివస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు నేడు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తులారాశి
తులారాశి జాతకులకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు భాగస్వామ్యాల్లో లాభాలు ఉంటాయి. సంబంధాలు మెరుగుపడతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఉద్యోగంలో మార్పులు రావచ్చు. కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
మకర రాశి
నేడు మకర రాశి జాతకులు సృజనాత్మక పనుల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఇది వీరికి శుభాలను కలుగజేస్తుంది.
కుంభరాశి
కుంభరాశి జాతకులు ఇంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధిత లాభాలు ఉంటాయి.
మీనరాశి
మీనరాశి జాతకులకు కమ్యూనికేషన్ ద్వారా లాభాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications