తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..!
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంలో ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణలు చేసి ఫలితాలు ప్రకటించాయి. ఇప్పుడు సీఓటర్ సంస్థ తన తాజా సర్వేలో ఆయా రాష్ట్రాల్లో తాజాగా మారిన పరిస్ధితుల ఆధారంగా మరింత పక్కాగా తన సర్వే ఫలితాలను వెల్లడించింది. సీఓటర్ తాజాగా నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ (opinion poll) ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
సి-వోటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం తమిళనాడులో పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. అధికార డీఎంకే కూటమి 41 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా, దాని తర్వాతి స్థానంలో 38 శాతం ఓట్లతో అన్నాడీఎంకే కూటమి ఉంది. విజయ్ కొత్త పార్టీ టీవీకేకు అధికారం సంగతి తర్వాత.. కనీస సీట్లు రావడం కూడా కష్టమేనని తేలిపోయింది. పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 44 శాతం ఓట్లతో ముందంజలో కనిపిస్తోంది. బీజేపీకి 40 శాతం దక్కే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

అలాగే అస్సాంలో మరోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని సీఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చింది. అస్సాంలో, బీజేపీ కూటమి 48 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కూటమి 35శాతం ఓట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. చివరిగా కేరళలో ఈసారి అధికార మార్పిడి తప్పేలా లేదు. అధికార ఎల్డీఎఫ్ కు 36 శాతం ఓట్లు మాత్రమే లభిస్తున్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. విపక్ష యూడీఎఫ్ మాత్రం 40 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications