Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తన కొత్త సినిమా కార్యక్రమాల్లో బీజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తోన్న సైంటిఫిక్ మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా. దీని వర్కింగ్ టైటిల్.. 'AA22 x A6'. 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ.

ఇప్పుడీ మూవీ కొత్త పోస్టర్ విడుదల అయింది. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న ఈ కొత్త మూవీ టైటిల్, టీజర్ రివీల్ చేసింది యూనిట్. దీని పేరు రాకా (Raaka). ఈ పోస్టర్ లో అల్లు అర్జున్‌ ఇంతకుముందెప్పుడూ చూడని నయా అవతార్‌లో కనిపించాడు. తోడేలు రూపంలో అదరగొట్టాడు. ప్రీలుక్ పోస్టర్‌తో భారీ హైప్ సృష్టించిన అల్లు అర్జున్.. ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించాడు.

Allu Arjun Drops Bold New Look for Raaka With Atlee Transformative Avatar and Signals Blockbuster

హై-ఎనర్జీ యాక్షన్ సాగాగా రూపొందుతుందని చిత్ర బృందం తెలిపింది. గుండు, ముఖం పాక్షికంగా కనిపించేలా డిజైన్ చేశారు ఈ పోస్టర్ ను. తోడేలు వంటి చేతితో సగం ముఖాన్ని కప్పుకొని కనిపించాడీ ఐకన్ స్టార్. కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. పుష్పలో గుబురు గెడ్డం, ఒత్తయిన జుట్టుతో కనిపించిన అల్లు అర్జున్.. ఇప్పుడు పూర్తి డిఫరెంట్ గెటప్ లో రగ్డ్ లుక్ లో కనిపించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గతంలో ఎప్పుడూ లేనంత భిన్నంగా ఉండబోతోంది.

ఈ సినిమా కథాంశం మొత్తం కూడా అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుందని, ఆదిమ స్వభావ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని టూకీగా వెల్లడించాడు అట్లీ. "రాకా" ఓ సినిమా మాత్రమే కాదని, తన జీవితంలో ఓ భాగమైందని పేర్కొన్నాడు. 18 సంవత్సరాలుగా తన రాకా ఆలోచనను మసగబారకుండా కాపాడుకుంటూ వచ్చానని, ఇప్పుడు దాన్ని తెరపైకి ఎక్కిస్తోన్నానని చెప్పుకొచ్చాడు. సర్వకాల సర్వావ్యవస్థల్లోనూ రాకాతో ఉండబోతున్న ఈ ప్రయాణం ఆరంభం మాత్రమేనని అట్లీ స్పష్టం చేశాడు.

"రాకా దర్శనం కోసం సిద్ధంగా ఉండండి" అనే ట్యాగ్‌లైన్‌తో సన్ పిక్చర్స్ ఈ ఫొటోలు విడుదల చేసింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, హిందీతో పాటు అరబిక్ భాషల్లో కూడా విడుదల కానుందీ ఫిల్మ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించనున్నారు. యువ సంచలనం సాయి అభయంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీని 2027 వేసవిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Take a Poll

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+