అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని
ఇస్లామాబాద్‌లో జరగనున్న ఇరాన్ కాల్పుల విరమణ చర్చల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ భద్రతా చర్యలను అంచనా వేయడానికి 30 మంది సభ్యుల అమెరికా అడ్వాన్స్ బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అమెరికా ప్రతినిధుల బృందానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది.
అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్‌కోవ్, జేర్డ్ కుష్నర్ సహా ముగ్గురు కీలక ప్రతినిధులు ఈ కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఇరాన్ నుండి ఆ దేశ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దీనికి హాజరుకానున్నారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ కు చేరుకున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. శనివారం చర్చలు ప్రారంభం కానున్నాయి.

ఈ చర్చల సన్నాహకాలపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ, అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ నటాలీ బేకర్ తో భేటీ అయ్యారు. బేకర్.. చర్చల కోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి నక్వీతో మాట్లాడారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మంత్రి నక్వీ విలేకరులతో మాట్లాడారు. చర్చల సారాంశాన్ని వివరించారు. విదేశీ అతిథులందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి భద్రత కల్పించేందుకు ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించామని స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్ లో అమెరికా ప్రతినిధులు బస చేసే హోటల్, చర్చల వెన్యూ, వారు రాకపోకలు సాగించే ప్రాంతాలన్నింటినీ కూడా రెడ్ జోన్ గా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీని పరిధిలో ఉన్న ఒక హోటల్‌ను ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ హోటల్ ను పూర్తిగా ఖాళీ చేయించారు. హోటల్ ప్రాంగణంలో దాని చుట్టూ భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. రాజధానిలో ఈ బృందాల బస సమయంలో రెడ్ జోన్ ప్రాంతం పూర్తిగా మూసివేస్తారు.
అలాగే రాజధానిలోకి ప్రవేశించే కొన్ని మార్గాలను కూడా మూసివేయనున్నట్లు సమాచారం. ప్రతినిధుల ప్రయాణం, బస, సమావేశాల సందర్భంగా వారికి 'బ్లూ బుక్' ప్రకారం వీవీఐపీ ప్రోటోకాల్ అమలు చేస్తారు. ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్‌లో కీలక ప్రభుత్వ భవనాలు, హోటళ్లు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రముఖుల నివాసాలు ఉండటంతో భద్రతపై మరింత దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ అత్యవసర విభాగాలు, ఆసుపత్రులను హై అలర్ట్‌లో ఉంచారు.
సిబ్బంది, అవసరమైన సామగ్రిని అన్ని సమయాల్లో అందుబాటులో ఉంచాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా రెడ్ జోన్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఐఎంసీబీ జీ-6/4లోని రెండు పరీక్షా కేంద్రాలతో పాటు, జీ-5లోని ప్రధానమంత్రి స్టాఫ్ కాలనీలో గల పరీక్షా కేంద్రాన్ని కూడా వాయిదా వేసినట్లు అధికారిక సమాచారం తెలియజేసింది.
గురువారం, శుక్రవారాల్లో ఇస్లామాబాద్, రావల్పిండిలలో సెలవులను ప్రకటించారు. ఇస్లామాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి, సురక్షితంగా మార్గదర్శనం చేయడానికి రోడ్లపై మోహరించారు. పౌరులు తమ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని, సహనంతో ఉండాలని, విదేశీ ప్రతినిధుల రాకపోకలు జరిగే సమయంలో ట్రాఫిక్ అధికారులతో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
-
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..? -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు












Click it and Unblock the Notifications