IPL 2026: ముంబై ఇండియన్స్‌ కొంపముంచిన బుడ్డోడు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. మంగళవారం గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఊచకోత మ్యాచ్‌ను ఏకపక్షం చేయగా.. బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో రాజస్థాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

వర్షం అంతరాయంతో 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 39) దూకుడుగా ఆడాడు.

Vaibhav Sooryavanshi Fearless 39-Run Blitz The True Turning Point in Rajasthan Royals Thrilling Win

తేలిపోయిన బుమ్రా..

ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా మొహమ్మద్ గజన్‌ఫర్(2/21) రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ ధాటికి జస్‌ప్రీత్ బుమ్రా కూడా తేలిపోయాడు. 3 ఓవర్లు వేసిన బుమ్రా 32 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ తీయలేకపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో మూడు బంతుల్లో వైభవ్ రెండు సిక్స్‌లు బాదడం గమనార్హం.

అనంతరం ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులే చేసి ఓటమిపాలైంది. షెర్ఫన్ రూథర్‌ఫోర్డ్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), నమన్ ధీర్(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే ఒక వికెట్ తీసాడు.


బుడ్డోడే ముంచాడు..

వర్షం కారణంగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచడంతో వికెట్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓ సిక్సర్‌తో పాటు నాలుగు బౌండరీలు బాదిన యశస్వి జైస్వాల్ 22 పరుగులు పిండుకోగా.. బుమ్రా బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న మూడు బంతుల్లో 2 సిక్స్‌లు బాదాడు. 15 ఏళ్ల వైభవ్ మొత్తం ఐదు సిక్సర్లతో ముంబై బౌలర్లను ఊచకోత కోసాడు.

యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 30 బంతుల్లో 80 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. వైభవ్ ఔటైనా.. యశస్వి జైస్వాల్ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. యశస్వి-వైభవ్ దూకుడైన ఓపెనింగ్ భాగస్వామ్యం ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+