నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి

బుల్లితెరపై తనదైన శైలిలో హాస్యంతో ప్రేక్షకులను అలరించింది ఫైమా. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న స్టాండప్ ప్రోగ్రామ్‌లలో గెస్ట్‌గా కనిపించిన ఫైమా, తన టైమింగ్, సహజ హాస్యంతో త్వరగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాత పటాస్ కార్యక్రమంలో రెగ్యులర్ కమెడియన్‌గా అవకాశం దక్కించుకుని తన ప్రతిభను మరింత నిరూపించుకుంది. ఆ తరువాత జబర్దస్త్ వేదికపై తన ఎనర్జీ, పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసి, ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించింది. అలాగే Bigg Boss Teluguలో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ప్రజాదరణ పొందింది.

ఇటీవల తన జీవితంలోని కఠిన అనుభవాలను బయటపెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ డిజిటల్ టాక్ షో Kissik Talksలో పాల్గొన్న ఆమె, తన చిన్ననాటి నుంచి కెరీర్ వరకు ఎదుర్కొన్న అవమానాలు, పేదరికం, ఒక ఆడపిల్లగా ఎదురైన కష్టాలను భావోద్వేగంగా పంచుకుంది. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ తనను తీవ్రంగా బాధపెట్టిందని ఎమోషనల్ అయ్యింది.

jabardasth-comedian-faima-shocking-comments-at-kissik-talk-show-goes-viral-on-media

నల్లగా ఉంది, గలీజ్‌గా ఉంది..

ఈ మేరకు ఫైమా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా తన ప్రయాణం సులభం కాలేదని తెలిపింది. నల్లగా ఉంది, గలీజ్‌గా ఉంది అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు తనను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా కలచివేశాయని ఆమె వాపోయింది. ఒకసారి ఆ బాధను తట్టుకోలేక తల్లికి ఫోన్ చేసి.. నన్ను ఇలా ఎందుకు కన్నావు అని అడిగిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకుంది. ఆ సమయంలో తన తల్లి కూడా తీవ్రంగా బాధపడిందని చెప్పింది. చిన్ననాటి పేదరికం గురించి మాట్లాడిన ఫైమా, తినడానికి సరైన ఆహారం కూడా లేని రోజులు ఉన్నాయని తెలిపింది.

అలానే పక్కింటి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే తాను చూసి ఏడ్చేదాన్నని, తనకు మాత్రం అన్నదమ్ముల పాత బట్టలే ఉండేవని చెప్పింది. కొత్త డ్రెస్ కావాలంటే పాత బట్టల ముక్కలను కలిపి కుట్టించుకునే పరిస్థితి ఉండేదని వివరించింది. అయినా ఆ కష్టాలు తనను మరింత బలంగా మార్చాయని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కానీ వాటిని ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళ్లానని ఫైమా పేర్కొంది. తనపై వచ్చిన విమర్శలు తనను వెనక్కి తగ్గించలేదని, వాటినే ప్రేరణగా తీసుకుని తన ప్రతిభను నిరూపించుకున్నానని చెప్పింది. ప్రస్తుతం తాను నిలబడ్డ స్థానం తన కష్టానికి ఫలితమని ఆమె స్పష్టం చేసింది.

మరోవైపు సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణ ఘటనలపై కూడా ఫైమా స్పందించింది. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అన్యాయాలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి నేరాలకు కఠిన శిక్షలు అవసరమని పేర్కొంది. బాధితుల పట్ల సమాజం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించింది. ఆడపిల్లగా జీవితంలో ఎదురైన కష్టాలను ప్రస్తావిస్తూ, కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె చెప్పింది. "ఆడపిల్లగా పుట్టినందుకు చాలా సార్లు బాధపడ్డాను" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే అదే సమయంలో, మహిళలు బలంగా నిలబడాలని, తమపై నమ్మకం ఉంచుకోవాలని కూడా ఆమె సందేశం ఇచ్చింది.

ఇక తన గురించి ఒక రూమర్ చెప్పాలంటే.. నరేష్ తో అక్రమ సంబంధం అంటూ జోక్ చేసింది. దీంతో ప్రస్తుతం ఫైమా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన అనుభవాలను పంచుకోవడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, మరింతగా ఎదగాలని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+