కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం..

పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు మార్చి నెల ఒక పీడకలగా మిగిలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా 11.6 శాతం పతనమయ్యాయి. 2008 అక్టోబర్ నాటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత నెలవారీ ప్రాతిపదికన బంగారం ఇంతలా క్షీణించడం మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని విక్రయించి నగదుగా మార్చుకోవడమే (Profit Booking) ఈ భారీ పతనానికి ప్రధాన కారణం.

భారతదేశంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం వరుసగా పదవ నెల కూడా కొనసాగినప్పటికీ, దాని వేగం మాత్రం గణనీయంగా మందగించింది. ఫిబ్రవరిలో 576 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, మార్చి నాటికి అవి 176.6 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే దాదాపు 68 శాతం మేర పెట్టుబడి తగ్గుదల కనిపించింది. మరోవైపు, చైనాలో మాత్రం భౌగోళిక-రాజకీయ అనిశ్చితి వల్ల ప్రజలు సురక్షితమైన ఆస్తిగా భావించి బంగారాన్ని కొనుగోలు చేయడంతో అక్కడ డిమాండ్ స్థిరంగా ఉంది.

Gold Market Meltdown Why Investors Are Selling Gold and Shifting to Cash Amid Rising US Interest Rates

అమెరికాలో 'రివర్స్' ట్రెండ్..

ఉత్తర అమెరికాలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత తొమ్మిది నెలలుగా బంగారంలోకి వచ్చిన పెట్టుబడులకు మార్చితో బ్రేక్ పడింది. ఏకంగా 13 బిలియన్ డాలర్ల నిధులు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి బయటకు వెళ్లాయి. చరిత్రలో ఇదే అతిపెద్ద నెలవారీ నిధుల బహిర్గతం (Outflow) కావడం గమనార్హం. గతంలో కోవిడ్ సమయం లేదా 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి.

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ప్రభావం..

బంగారం అమ్మకాలకు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' వంటి అంశాలు ప్రేరేపితమైన 'రిస్క్-ఆఫ్' పరిస్థితులు ప్రధాన కారణమయ్యాయి. చమురు మినహా అన్ని రకాల ఆస్తుల ధరలు పడిపోవడంతో, పెట్టుబడిదారులు తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి అప్పటి వరకు లాభాల్లో ఉన్న బంగారాన్ని విక్రయించి నగదును పెంచుకున్నారు. దీనికి తోడు డాలర్ విలువ పెరగడం, వడ్డీ రేట్ల కోత అంచనాలు సెప్టెంబర్ 2027 వరకు వాయిదా పడటంతో బంగారంపై పెట్టుబడి 'భారం'గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

యూరప్‌లోనూ విక్రయాల జోరు..

కేవలం అమెరికాలోనే కాకుండా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో కూడా బంగారాన్ని భారీగా విక్రయించారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) వడ్డీ రేట్లను పెంచవచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై వచ్చే ఆదాయం కంటే అవకాశ వ్యయాలు (Opportunity Costs) ఎక్కువగా ఉంటాయని ఇన్వెస్టర్లు భావించడమే ఈ పతనానికి కారణం.

మొత్తానికి, ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మరియు వడ్డీ రేట్ల అంచనాలు గట్టి బ్రేక్ వేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+