ఈ వారం రాశిఫలాలు :నవంబరు 9 శుక్రవారం నుండి నవంబరు 15 గురువారం వరకు


డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.

 

మేష రాశి

ఈ వారం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యసాధనలో పట్టుదలఅవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు చేయాలి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి.పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులుపూర్తి.ఇతరులపై ఆధారపడతారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటా యి.సమిష్టి ఆదాయాలు లభిస్తాయి.నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు.దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటా యి.

వృషభ రాశి

ఈ వారం విశ్రాంతిలోపం ఏర్పడుతుంది.సుఖం కోసం ఆలోచిస్తారు.అన్నిరకాల ఖర్చులు చేస్తారు. అధికారులతో అనుకూలత ఉంటుంది.చేసే వృత్తులలో గౌరవం ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.కళాకారులకు అనుకూల సమయం.స్త్రీల ద్వారా ఆదాయ మార్గాలు. పరాశ్రయం ఉంటుంది. కళానైపుణ్యం పెరుగుతుంది.

మిథున రాశి

ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. శరీర బలం పెంచుకునే ప్రయత్నం.కళలపై ఆసక్తి పెరుగుతుంది.దురాశ పెరుగుతుంది.సమిష్టి ఆదాయాలు ఉంటా యి. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం.పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది.దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. సజ్జన సాంగత్యం ఉంటుంది.పెద్దలతో అనుకూలత కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం.

కర్కాటక రాశి

ఈ వారం ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.గౌరవం తగ్గే సూచన ఉంటుంది. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు.అధికారం వల్ల అనుకూలత ఏర్పడుతుంది.శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనుకోని ఇబ్బందులు ఉంటా యి.ఊహించని సమస్యలు ఉంటాయి.ఇతరులపై ఆధారపడతారు.ఆకస్మిక నష్టాలు వచ్చే సూచన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.విదేశ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది.శాస్త్రపరిజ్ఞానంతగ్గుతుంది.

సింహరాశి

ఈ వారం భాగస్వాములతో సంతోషం ఏర్పడుతుంది. మిత్రులతో సంతోషం ఉంటుంది.అనారోగ్య భావనలు ఉంటాయి.క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది.ఇతరులపై ఆధారపడతారు. అవమానాల పాలు కాకుండా జాగ్రత్త పడాలి.లాభనష్టాలు సమానంగా ఉంటాయి. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకై ప్రయత్నం.సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. పదిమందిలో గౌరవం కోసం చూస్తారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి.

కన్యారాశి

ఈ వారం భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఉంటా యి.ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది.క్రయ విక్రయాల్లో లోపం ఉంటుంది.శత్రువులపై విజయం సాధిస్తారు.పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనల్లో ఒత్తిడి తగ్గుతుంది.వృత్తి విద్యలపై దృష్టి పెడతారు.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.నూతన పరిచయస్తులతో అనుకూలత ఏర్పడుతుంది.

తులా రాశి:

ఈ వారం పదిమందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సామాజిక అభివృద్ధి ఉంటుంది.మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.చిత్త చాంచల్యం తగ్గుతుంది. విద్యార్థులకు ఒత్తిడి సమయం. సంతాన సమస్యలు అధికంగా ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం.రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శారీరకబలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార ధాన్యాలు అనుకూలం.

వృశ్చికరాశి

ఈ వారం పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కార్య సాధన ఉంటుంది. శత్రువులపై విజయం చేకూరుతుంది.విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం.ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన ఉంటుంది.మాతృసౌఖ్యం లోపిస్తుంది.మానసిక ఒత్తిడి ఉంటుంది.ఒత్తిడితో కార్యసాధన ఉంటుంది.సంతాన సమస్యలు ఉంటాయి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సురాశి

ఈ వారం కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఉంటుంది.విద్యార్థులకు అనుకూల సమయం.ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు.గృహ సంబంధ విషయాల్లో అనుకూలత లభిస్తుంది. కార్యసాధన ఉంటుంది.వాగ్దానాలు నెరవేరుతాయి.కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.అనుకున్న పనులు పూర్తిచేస్తాయి.వాక్‌ చాతుర్యం పెరుగుతుంది.మాతృవర్గీయుల, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది.విద్యార్థులకు అనుకూల సమయం.

మకరరాశి

ఈ వారం విద్యార్థులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు.ఆహారంలో సమయ పాలన అవసరం.చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి.కుటుంబంకోసం తాపత్రయ పడతారు.అనుకున్న పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట వలన సంతోషం ఉంటుంది.సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాలు సంతృప్తినిస్తాయి.

కుంభరాశి

ఈ వారం కుటుంబంలో సంతోషకర వాతావారణం ఉంటుంది.నిల్వ ధనాన్నిపెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాతృ వర్గీయుల సహకారం లభిస్తుంది.విద్యార్థులకు అనుకూల సమయం.రచనలపై ఆసక్తి పెరుగుతుంది.శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది.మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది.శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.సమాజంలో మాట విలువ పెరుగుతుంది.

మీన రాశి

ఈ వారంలో కార్యసాధనలో పట్టుదల అవసరం.ఆలోచనల్లో మార్పు ఉంటుంది.అభిరుచులకు అనుగుణంగా ఆలోచనలనల మార్పు.శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన. నిల్వధనాన్ని కోల్పోతారు.వాగ్దానాలవల్ల ఒత్తిడి ఉంటుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది.చిత్త చాంచల్యం ఉంటుంది.దేహసౌఖ్యం లోపిస్తుంది. మానసిక ఒత్తిడి అధికం.పరాధీనత ఉంటుంది.పాదాల నొప్పులు ఉంటాయి.శారీరక శ్రమ అధికం.

Have a great day!
Read more...

English Summary

The Astro Twins forecast every sign's horoscope for this week. Find out if love is in your future, if you're headed towards a change in your career, or how the planet's alignment will effect your outlook on life.