కలలు నిజమవుతాయా? మహిళ ప్రాణం నిలబెట్టిన వింత కల.. సైన్స్ ఏమంటోంది?

ఓ మహిళ కలలోకి వచ్చిన మరణించిన తల్లి, క్యాన్సర్ పరీక్ష చేయించుకోమని హెచ్చరించడం.. ఆ తర్వాత నిజంగానే ఆమెకు వ్యాధి నిర్ధారణ కావడం ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు మన మెదడు భవిష్యత్తును చూడగలదా? కలలు మనకు ముందస్తు హెచ్చరికలు చేస్తాయా? అనే అంశం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

మరణించిన తల్లి హెచ్చరిక.. ప్రాణం నిలబెట్టిన వైనం
బీబీసీ నివేదిక ప్రకారం.. 2011లో ఎడలైన్ అనే మహిళ తన తల్లిని తలచుకుంటూ తీవ్ర విచారంలో ఉన్న సమయంలో ఓ వింత కల వచ్చింది. మూడేళ్ల క్రితమే చనిపోయిన ఆమె తల్లి కలలోకి వచ్చి.. "నేను బాగున్నాను కానీ, నువ్వు వెంటనే వెళ్లి డాక్టర్‌కు చూపించుకో" అని చెప్పింది. ఆ కల ఎంత స్పష్టంగా ఉందంటే.. ఎడలైన్ దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఆమెకు మొదటి దశ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సకాలంలో గుర్తించడంతో చికిత్స అంది ఆమె ప్రాణాలు దక్కించుకుంది. ఆ కల రాకపోయి ఉంటే తాను ఈ రోజు బతికి ఉండేదాన్ని కాదని ఎడలైన్ భావిస్తోంది.

Science of Dreams Can Dreams Predict Future Woman Diagnosed with Cancer After Dream Warning

కలల వెనుక ఉన్న ప్రాచీన నమ్మకాలు
కలలను కేవలం ఊహలుగా కాకుండా భవిష్యత్తు సంకేతాలుగా భావించడం మానవ చరిత్రలో కొత్తేమీ కాదు. ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, బాబిలోనే సంస్కృతులలో కలలు భవిష్యత్తును సూచిస్తాయని నమ్మేవారు. అనేక మతాలు కలలను దైవ సందేశాలుగా పరిగణిస్తాయి. కొన్ని తెగలలో చనిపోయిన పూర్వీకులు కలల ద్వారా హెచ్చరికలు చేస్తారని నమ్ముతారు. ఎడలైన్ కూడా తన చిన్నతనం నుంచి ఇవే నమ్మకాల మధ్య పెరగడం వల్ల ఆ కలను సీరియస్‌గా తీసుకుంది. నేటి ఆధునిక కాలంలో కూడా సోషల్ మీడియాలో కలల అర్థాల గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు.

కలలు ఎందుకు వస్తాయి? మెదడు పనితీరు ఏమిటి?
శాస్త్రవేత్తల ప్రకారం.. కలలు కనడం అనేది మెదడు సహజ ప్రక్రియ. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అత్యధికంగా కలలు వస్తాయి. రోజంతా మనం సేకరించిన సమాచారాన్ని, అనుభవాలను, ఆందోళనలను మెదడు క్రమబద్ధీకరించే క్రమంలో ఇవి ఏర్పడతాయి. కలలు కనేటప్పుడు మన మెదడులోని తార్కిక భాగం విశ్రాంతిలో ఉంటుంది. కానీ భావోద్వేగాల భాగం చురుగ్గా ఉంటుంది. అందుకే కలలు చాలా వింతగా, అర్థం కానట్లుగా కనిపిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం.. కలలు మనకు సమస్యల పరిష్కారంలో, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సహాయపడతాయి.

సైన్స్ ఏమంటుంది? భవిష్యత్తును చూడగలమా
కలలు భవిష్యత్తును చూస్తాయని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. సైంటిస్టుల ప్రకారం.. మనం రోజూ ఎన్నో కలలు కంటాం.. కానీ ఏవైనా నిజజీవిత ఘటనలతో పోలినప్పుడు మాత్రమే వాటిని గుర్తుంచుకుంటాం. ఎడలైన్ విషయంలో.. బహుశా ఆమె శరీరంలో జరుగుతున్న సూక్ష్మ మార్పులను ఆమె ఉపచేతన మనస్సు గుర్తించి ఉండవచ్చు. అది కల రూపంలో బయటపడి ఉండవచ్చు. అయితే తరచుగా పీడకలలు రావడం అనేది పార్కిన్సన్ లేదా డిమెన్షియా వంటి వ్యాధులకు ముందస్తు సంకేతమని కొన్ని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

జాగ్రత్తలు అవసరం
కలలు ఎల్లప్పుడు నిజం కాకపోవచ్చు. కానీ అవి మన మానసిక, శారీరక స్థితిని ప్రతిబింబిస్తాయి. మీకు తరచుగా పీడకలలు వస్తున్నట్లయితే ఆందోళన చెందకుండా ధ్యానం చేయడం, మంచి నిద్ర అలవాట్లు చేసుకోవడం, పడుకునే ముందు భయానక దృశ్యాలు చూడకుండా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎడలైన్ లాంటి సంఘటనలు అరుదుగా జరిగినప్పటికీ.. మన శరీరం ఇచ్చే సూక్ష్మ సంకేతాలను అర్థం చేసుకోవడం ప్రాణాలను కాపాడుతుందని ఈ ఘటన నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+