ఆ ఒక్క పాట కోసం సినిమానే వాయిదా.. బుచ్చిబాబు ప్లాన్ మామూలుగా లేదుగా!

డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా విడుదల జూన్ నెలకు వాయిదా పడటానికి ప్రధాన కారణం అందులోని ఓ స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఇప్పటికే సెట్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. సరైన బ్యూటీ దొరకకపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే కేవలం గ్లామర్ కోసమే అనుకునేవారు.. కానీ ఇప్పుడు ఈ ఒక్క పాట సినిమా క్రేజ్‌ను డిసైడ్ చేసే రేంజ్‌లో మారిపోయింది.

మృణాల్ లేదు.. మానస డౌటే!
మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించింది. ఆమె ఓ వైపు క్లాస్ ప్రేక్షకులను, మరోవైపు తన అందచందాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోగలదని అభిమానులు ఆశపడ్డారు. మృణాల్ ఇప్పటివరకు ఇలాంటి భారీ ఐటెం సాంగ్స్ చేయకపోవడంతో ఓ విధమైన ఫ్రెష్‌నెస్ ఉంటుందని భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ హీరోయిన్ మానస వారణాసి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది కానీ.. చరణ్ లాంటి స్టార్ సరసన మాస్ స్టెప్పులు వేయడానికి ఆమె సెట్ అవుతుందా లేదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేశారు.

Ram Charan Peddi Movie Postponed to June for a Special Song Buchi Babu Sana Hunts for Item Beauty

సంయుక్త మీనన్ ఆ రేంజ్‌లో ఊరమాస్ చూపిస్తుందా?
తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తోందట. సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్నా.. డ్యాన్స్ విషయానికి వస్తే సమంత (ఊ అంటావా), పూజా హెగ్డే (జిగేల్ రాణి) లేదా కాజల్ అగర్వాల్ (పక్కా లోకల్) స్థాయిలో ఎనర్జీని చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. ఒక మాస్ సాంగ్‌కు కావాల్సిన గ్రేస్, చార్మ్, ఊర మాస్ అప్పీల్ సంయుక్తలో ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

బుచ్చిబాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదే!
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాత్రం రెగ్యులర్‌గా కనిపించే స్టార్ హీరోయిన్ల కంట, కొంత వెరైటీగా ఉండే నటిని ఎంచుకోవాలని చూస్తున్నారట. ఇది ఓ రకమైన ప్రయోగమే అయినప్పటికీ.. మెగా పవర్‌స్టార్ సినిమా కావడంతో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాట కోసం సినిమా విడుదలను వాయిదా వేయడం చూస్తుంటే, దర్శకుడు దీనిపై ఎంతటి నమ్మకంతో ఉన్నారో అర్థమవుతోంది. మరి ఆఖరికి ఆ 'పెద్ది' బ్యూటీ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+