ఓటీటీలోకి శ్రీదేవి రొమాంటిక్ సినిమా.. కుర్రాళ్లూ గెట్ రెడీ..!
కోర్ట్ సినిమాతో బ్లాస్ బస్టర్ హిట్ కొట్టింది యంగ్ హీరోయిన్ శ్రీదేవి. ఈ మూవీలో ఆమె సహజమైన నటనకు అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే హిట్టు కొట్టడంతో ఆమెకు వరసగా ఆఫర్స్ పెరిగాయి. కోర్ట్ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద విజిల్స్ పడ్డాయి. అయితే ఈ క్యూట్ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు 'బ్యాండ్ మేళం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే మార్చి 26 న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది. అలాగే మరోసారి రోషన్, శ్రీదేవి జంట తమ కెమిస్ట్రీతో అందరినీ అలరించారు. అయితే ఇప్పుడీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటన చేశారు. దాంతో కుర్రకారు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఇక బ్యాండ్ మేళం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకోవడం విశేషం. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇదే విషయాన్ని జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది. 'బ్లాక్ బస్టర్ పెయిర్ మళ్లీ రాబోతుంది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువు వేయబోతుంది. రిథమ్ కు మీరు రెడీనా..? ఏప్రిల్ 24న బ్యాండ్ మేళం ప్రీమియర్ కేవలం జీ 5 లో మాత్రమే' అని క్యాప్షన్ ఇచ్చింది.

ఇక బ్యాండ్ మేళం మూవీలో సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు కీలక ప్రధాన పాత్రల్లో నటించారు. బేబీ మూవీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.












Click it and Unblock the Notifications