Vastu : వాస్తు ప్రకారం ఈ 5 విగ్రహాలు మీ ఇంట్లో ఉండాలి!
జీవితంలో ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి వెన్నాడుతూనే ఉంటాయి అని చాలామంది బాధపడుతుంటారు. మన చుట్టూ ఉండే వాతావరణం మన ఆలోచనలను, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు కొన్ని ప్రత్యేక విగ్రహాలను సరైన దిశలో ఉంచడం వల్ల అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. వాటిగురించి తెలుసుకుందాం.
తాబేలు: ఆర్థిక స్థిరత్వానికి వెన్నుముక
పురాణాల ప్రకారం తాబేలు విష్ణుమూర్తి (కూర్మావతారం) స్వరూపం.
లక్ష్మీదేవికి తాబేలు అంటే అత్యంత ప్రీతి.
ఇంటి డ్రాయింగ్ రూమ్‌లో
తూర్పు లేదా ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని ఉంచాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది.
వ్యాపారంలో నష్టాలు తగ్గి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
ముఖ్యంగా లోహంతో చేసిన తాబేలును
నీటి గిన్నెలో ఉంచితే ఫలితం మరింత త్వరగా వస్తుంది.

ఏనుగు: ఐశ్వర్, దోష నివారణ
ఏనుగు గజలక్ష్మికి ప్రతీక. ఇది రాజసం, శ్రేయస్సును సూచిస్తుంది.
తూర్పు దిశలో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం అత్యంత శుభప్రదం.
ఇది రాహు దోష ప్రభావాలను తగ్గిస్తుంది.
కుటుంబ సభ్యుల మధ్య కలహాలను తొలగించి ఆనందాన్ని నింపుతుంది.
ఉద్యోగాల్లో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణకు అడ్డంకులు తొలగిపోయేలా చేస్తుంది.
ఒంటె: విజయ పథంలో వేగం
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఒంటె విగ్రహం కష్టపడే తత్వాన్ని, పట్టుదలను సూచిస్తుంది.
ఇంటి వాయువ్య మూలలో ఒంటె విగ్రహాన్ని ఉంచాలి.
వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను ఇది తొలగిస్తుంది.
ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి.
కెరీర్‌లో స్థిరత్వం కోరుకునే వారు దీనిని తప్పక ఉంచుకోవాలి.
రెండు హంసలు: దాంపత్య మాధుర్యం
ఇంట్లో డబ్బు ఉన్నా ప్రశాంతత లేకపోతే ఆ జీవితం వ్యర్థం.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నచోట లక్ష్మి నిలవదు.
బెడ్‌రూమ్‌లో ఉత్తర దిశలో ఒక జత హంసల విగ్రహాన్ని ఉంచాలి.
హంసలు ప్రేమకు, విశ్వాసానికి గుర్తు.
ఇవి ఇంట్లో ఉంటే దంపతుల మధ్య అపోహలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది.
ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.
ఆవు: సకల దేవతల నిలయం
గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన నమ్మకం.
ఆవు విగ్రహం లేని ఇల్లు అసంపూర్ణం.
ఈశాన్యం లేదా పూజా గదిలో ఆవు విగ్రహాన్ని ఉంచవచ్చు.
ఇది పిల్లల భవిష్యత్తుకు చాలా మంచిది.
ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పోగొట్టి, పవిత్రతను పెంచుతుంది.
ఆర్థికంగా ఎప్పుడూ లోటు లేకుండా చూస్తుంది.
ఈ విగ్రహాలను ఉంచే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి.
విరిగిన లేదా మురికిగా ఉన్న విగ్రహాలను ఉంచకూడదు.














Click it and Unblock the Notifications