సూపర్ రిచ్ కంట్రీగా భారత్.. బయటపడ్డ 42.5 టన్నుల బంగారం..!
భారతీయులను బంగారాన్ని విడివిడిగా చూడలేం.. బంగారంతో అంత మమేకం అవుతారు మనవాళ్లు. ఫంక్షన్ ఏదైనా ఒంటి నిండా ఆభరణాలతో రెడీ అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు అశోకుని కాలం నుంచి భారత్ బంగారంపై ఎనలేని ప్రేమని ప్రదర్శిస్తూ వస్తోంది. ఇక ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ లో తులం బంగారం రూ. లక్షా 50 వేలకు పైనే ఉంది. దాంతో బంగారం కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. పైగా ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు సీజన్ కావడంతో బంగారం కొనకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. దాంతో చేసేదేంలేక రూ. లక్షలు ఖర్చు చేసి మరీ బంగారం కొనేస్తున్నారు.
ఇక ఏటా భారత్ విదేశాల నుంచి దాదాపు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. అయితే ఇప్పుడు భారతీయులకు గుడ్ న్యూస్. భారత్ కు జాక్ పాట్ తగిలింది. ఏపీలోని కర్నూల్ జిల్లాలో భారీ బంగారు గని బయటపడింది. కొత్త బంగారు గని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. బంగారం దిగుమతులు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలోని కర్నూలు జిల్లాలో దాదాపు 42.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో.. దేశంలోనే తొలిసారిగా మొదటి ప్రైవేట్ బంగారు గని ఇదే కావడం విశేషం. దీనిని జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇక ఈ ప్రాంతంలో మొత్తం 42.5 టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు అంచనా.

అలాగే ప్రస్తుతం తవ్వకాలకు 13.1 టన్నుల బంగారం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ గని ద్వారా ఏడాదికి దాదాపు 1000 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ లో దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇక ఈ గని దాదాపు 15 ఏళ్లపాటు కార్యకలాపాలు సాగిస్తుందని అంచనా..












Click it and Unblock the Notifications