ఏపీలో ఇళ్ళు లేనివారికి తీపికబురు.. కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో ఇల్లు లేని వారికి శుభవార్త. ఏపీలో సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారికి ప్రభుత్వ చేయూతనిస్తూ ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రామీణ ప్రాంతాలలో కొత్త ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారికి ఈ నెలాఖరులోగా కొత్త ఇళ్ళు మంజూరు జరుగుతుందని చెప్పి తీపి కబురు చెప్పింది.
ఇళ్ళ మంజూరుకు ముహూర్తం ఫిక్స్
కేంద్రం నుండి నుంచి లక్ష ఇళ్ళు మంజూరు కానున్నాయని, పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా వీటిని ఇవ్వనున్నారని పేర్కొంది. పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న ఏపీ గ్రామీణ ప్రజలకు తీపికబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మే నెలాఖరులోగా లబ్దిదారుల జాబితా విడుదల చేసి, జూన్ నెల నుంచి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రణాళిక చేసింది.

మొదటి విడతగా లక్షమందికి ఇళ్లు
గత ఏడాది డిసెంబర్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి సౌకర్యం కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి 7 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో మొదటి విడతగా లక్షమందికి ఇళ్లు మంజూరు చేయనున్నారు.
స్పర్శ్ విధానంలో డబ్బులు లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ
ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా స్థలం ఉన్న వారికి 2.39 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవ్వనున్నాయి. ఈ డబ్బులు నేరుగా స్పర్శ్ విధానంలో లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ కానుంది. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 72,000, కేంద్రం మరుగుదొడ్ల పథకం కింద 39 వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష 28 వేల రూపాయలు ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి ఇవ్వనుంది.
సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం
గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తులను స్వీకరించినా జాబితా సిద్ధం చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ దరఖాస్తులు స్వీకరించి ప్రక్రియ వేగవంతం చేసిందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని చెప్పవచ్చు.













Click it and Unblock the Notifications