గుడ్ ఛాన్స్.. డోంట్ మిస్: దరఖాస్తులను ఆహ్వానిస్తోన్న టీటీడీ కాలేజీలు

తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది టీటీడీ. జూన్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా ?

విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే " Student Manual in English" or "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేశాక, అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదవాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు జూనియర్ కాలేజీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి.

Apply Online for 2026-27 Admissions to Sri Padmavathi Women s and Sri Venkateswara Junior College

వాటిలో తమకు కావాల్సిన బాక్స్ లపై క్లిక్ చేస్తే రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూప్ లలోని సీట్లు, వాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు, తదితర వివరాలు కనిపిస్తాయి. విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు.

సీటు పొందిన సదరు విద్యార్థి ధృవీకరణ పత్రాలను వారి సమక్షంలోనే సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు డిలెట్ అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు.

అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌, క‌ళాశాల‌ ప్రాస్పెక్ట‌స్‌ను పూర్తిగా చదివి, ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ సూచించింది. విద్యార్థులు దరఖాస్తు నింపు సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+