Chandrababu: ఫలితాలపై చంద్రబాబు వ్యూహాత్మక ట్వీట్..!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో బీజేపీ విజయం సాధిస్తున్నాయి. ఈ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) చాలా వ్యూహాత్మకంగా స్పందించారు. కేవలం తమ ఎన్డీయే కూటమి పార్టీల విజయాలపై ప్రధాని మోడీ, అమిత్ షాను అభినందిస్తూ ట్వీట్ పెట్టిన చంద్రబాబు, పొరుగున ఉన్న తమిళనాడలో తాను ప్రచారం చేసినా బీజేపీ కూటమి రెండో స్ధానంలో నిలిచి విజయ్ పార్టీ గెలుస్తున్నా స్పందించలేదు.

Election Results 2026: ఓటమి బాటలో ముగ్గురు సీఎంలు, డజన్ల కొద్దీ మంత్రులు..!
Election Results 2026: ఓటమి బాటలో ముగ్గురు సీఎంలు, డజన్ల కొద్దీ మంత్రులు..!

బీజేపీ విజయాలపై స్పందిస్తూ చంద్రబాబు.. ఈరోజు ఎన్డీఏ సాధించిన విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపైనా, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైనా ప్రజలకు ఉన్న నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' స్ఫూర్తితో నడిచే ప్రజల ఆకాంక్షల సంగమంగా ఎన్డీఏను ఇది మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ ఫలితంతో వికసిత భారత్ దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమైందన్నారు.

Chandrababu Tweets Selectively After Election Results Congratulates NDA Cold-Shoulders TVK and UDF

Vijay: తమిళనాడు సీఎంగా విజయ్..! మొదలైన ప్రోటోకాల్-ఇంటికి భారీ భద్రత..!
Vijay: తమిళనాడు సీఎంగా విజయ్..! మొదలైన ప్రోటోకాల్-ఇంటికి భారీ భద్రత..!

అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న అచంచలమైన నిబద్ధతకు ప్రజల విశ్వాసం, మద్దతు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. యువ భారతదేశం విశ్వసనీయతకు, అభివృద్ధికి, పౌరులతో నిజమైన అనుబంధానికి విలువ ఇస్తుందనే సందేశాన్ని ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందిస్తోందన్నారు. ఈ చారిత్రాత్మక తీర్పుకు ప్రధాని మోడీకి అమిత్ షాకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు, ఎన్డీఏ విజేతలందరికీ, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+