ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండవేడి ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోండగా.. మరో వైపు వర్షాలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తోన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ.. అక్కడక్కడ చెదురుమదురుగా కురుస్తోన్న వర్షాలు ప్రజలను సేదతీరుస్తోన్నాయి. మెజారిటీ జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Light-Moderate Rain with Thunder Expected in Vizianagaram Manyam Alluri and Across Andhra Pradesh

ద్రోణి ప్రభావంతో నేడు కూడా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర ప్రఖర్ జైన్ అన్నారు.

కాగా శనివారం ప్రకాశం జి కొప్పెరపాడులో 45.4, మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. నేడు ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని, మరో 124 మండలాల్లో సాధారణ స్థాయిలో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+