ఏపీకి మరో బడా కంపెనీ.. రూ.1000 కోట్ల పెట్టుబడి - 3000 ఉద్యోగాలు !!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా కూటమి సర్కారు దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడుల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేశ్ కృషితో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. గత 22 నెలల కాలంలోనే రాష్ట్రంలో సుమారు 800కి పైగా కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, ఐటీ, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి.
కాగా ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ Carrier Global Corporation ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ముందుకు రావడం విశేషంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఈ సంస్థ తన నూతన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మే 6, 2026న మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ₹1000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రానుంది.

దాదాపు 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడనున్న ఈ ప్లాంట్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేసి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత దాదాపు 3,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ యూనిట్‌లో ముఖ్యంగా HVAC (Heating, Ventilation, Air Conditioning) ఉత్పత్తుల తయారీ జరగనుంది. అత్యాధునిక సాంకేతికత, ఆటోమేషన్, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీంతో దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులకూ ఈ యూనిట్ కీలక కేంద్రంగా మారే అవకాశముంది.
అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) కూడా ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. సప్లై చైన్ బలోపేతం అవుతూ, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి (Skill Development) కార్యక్రమాల ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
#CarrierComesToAP #ChooseSpeedChooseAP
— Lokesh Nara (@naralokesh) May 5, 2026
Andhra Pradesh is moving beyond hosting data centres - to manufacturing the components that power the global data boom.
Tomorrow, we break ground on Carrier Global Corporation’s new chiller manufacturing facility at Sri City. It is a… pic.twitter.com/krRvBvG2q3
ఇక శ్రీసిటీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ ఇప్పటికే పలు మల్టీనేషనల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. క్యారియర్ సంస్థ రాకతో ఈ ప్రాంత ప్రాధాన్యత మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక విధానాలు ఇదే రీతిలో కొనసాగితే, ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications