గ్యాస్ సబ్సిడీ కట్!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ (LPG) సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రంగంలోకి దిగాయి. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల పరిమితి దాటిన అనర్హులైన లబ్ధిదారులను ఏరివేసే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందుకోసం ప్రత్యక్ష నగదు బదిలీ (DBTL) డేటాను ఆదాయపు పన్ను శాఖ వివరాలతో అనుసంధానించి వడపోత సాగిస్తున్నాయి.

ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి కంపెనీలు ఇప్పటికే తమ లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ (SMS) సందేశాలను పంపుతున్నాయి. వినియోగదారుడి లేదా అతని కుటుంబ సభ్యుల స్థూల పన్ను విధించదగిన ఆదాయం (Gross Taxable Income) రూ. 10 లక్షల వార్షిక పరిమితిని మించిందని ఈ మెసేజ్‌ల సారాంశం. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఆదాయ పరిమితి దాటిన వారికి సబ్సిడీ పొందే అర్హత ఉండదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

LPG Subsidy Cuts OMCs Targeting Taxpayers Earning Above Rs 10 Lakhs Check Your SMS For Subsidy Alerts
పెట్రోల్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్?
పెట్రోల్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్?

ఏడు రోజులే గడువు.. లేదంటే నిలిపివేత!

తమకు వచ్చిన సందేశంలోని సమాచారం తప్పు అని భావించే వారు ఏడు రోజుల్లోగా స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా సవాల్ చేయకపోతే, సదరు వినియోగదారుడికి ఎల్పీజీ సబ్సిడీ ఆటోమేటిక్‌గా నిలిపివేయబడుతుందని చమురు కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. సమాచార సవరణ లేదా ఫిర్యాదుల కోసం సంబంధిత కంపెనీ పోర్టల్స్ ద్వారా లేదా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన
దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన

ఆర్థిక క్రమశిక్షణ దిశగా అడుగులు!

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సబ్సిడీ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా గతంలోనే కొత్త కనెక్షన్ల నిలిపివేత, రీఫిల్ బుకింగ్ గడువు పొడిగింపు వంటి చర్యలు తీసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి అనవసర దిగుమతులపై ఆంక్షలు మరియు ఇంధన ధరల పెంపు వంటి అంశాలపై పీఎంఓ (PMO), ఆర్థిక శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతున్నాయి.

మొత్తానికి, ఆదాయం ఉన్నవారికి సబ్సిడీ ఎగ్గొట్టే ప్రక్రియ ఇప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి రావడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లో చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+