ఏపీలో వాహనాల రిజిస్ట్రేషన్ కు కొత్త విధానం..! 24 గంటల్లోనే..! ఫ్యాన్సీ నంబర్లకు..!
ఏపీలో కొత్త వాహనం కొనడం ఓ గండం అయితే, దానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవడం, ఆర్సీ తీసుకోవడం మరో గండంగా మారిపోయిన పరిస్ధితుల్లో ప్రభుత్వం ఎట్టకేలకు వాహనాల రిజిస్ట్రేషన్ల (Vehicle Registration) విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త వాహనం తీసుకున్నప్పుడు దానికి కట్టాల్సిన పన్నులన్నీ కట్టేసిన తర్వాత వాహనదారులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేలా ఈ మార్పులు చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి రాంప్రసాద్ ప్రకటించారు. వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత 24 గంటల్లో దానికి అధికారులు ఆమోదం తెలిపేలా మార్పు చేశారు. ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రం ఇది వర్తించదు.టెంపురరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 24 గంటల గడువులోపు అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందేలా సాఫ్ట్ వేర్ లో మార్పు చేశారు. దీంతో శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ 24 గంటల్లో పూర్తి కానుంది.

టెంపురరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 24 గంటల గడువులోపు అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్ గా అది ఆమోదం పొందేలా సాఫ్ట్ వేర్ లో మార్పు చేశారు. దీంతో శాశ్వత రిజిస్ట్రేషన్, నంబర్ జనరేషన్ 24 గంటల్లో పూర్తి కానుంది. పనిదినాలతో పాటు సెలవు రోజుల్లో కూడా ఆన్ లైన్ ద్వారా రెజిస్ట్రేషన్లకు ఆమోదం ఇస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగాఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్లకు చెక్ పడనుంది. అలాగే ప్రజలకు పారదర్శక, సులభ సేవల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమలు కానుందని మంత్రి మండిపల్లి తెలిపారు.














Click it and Unblock the Notifications