దుమ్ము రేపిన గవర్నమెంట్ స్కూల్స్, మంత్రి లోకేష్ కు హ్యాట్సాఫ్!

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ పాలనలో 'నిజాయితీ' అన్నది అరుదైన విషయం. ముఖ్యంగా విద్యాశాఖ వంటి కీలక రంగంలో సంస్కరణలు తీసుకురావడం కత్తిమీద సామే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించినప్పుడే నారా లోకేష్ ఒక మాట చెప్పారు.. "సవాళ్లను స్వీకరించడం, అడ్డంకులను అధిగమించడం తన హాబీ" అని. నిన్న పదో తరగతి ఫలితాల తర్వాత ఆయన విడుదల చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా విద్యా రంగంలో సరికొత్త రికార్డుగా నిలిచింది. టెన్త్ లో చాలా మంది విద్యార్ధులు 590+ మార్కులు సాధించారు. వీరిని చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు బ్లాక్‌బస్టర్స్ రాబోతున్నాయని తెలిపారు.

గత ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థపై పడిన రాజకీయ రంగును తుడిచివేయడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేశారు. తప్పు జరిగితే ఒప్పుకుంటూ, పారదర్శకతతో ముందుకు సాగుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల ప్రకటన. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు అంటే ముఖ్యమంత్రి, మంత్రుల భారీ ఫోటోలు, పార్టీ రంగులు, ప్రభుత్వ నినాదాలతో నిండిపోతాయి. కానీ, లోకేష్ ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్‌లో ఎక్కడా ఆయన ఫోటో కానీ, ముఖ్యమంత్రి ఫోటో కానీ కనిపించవు.

Nara Lokesh Sets a New Record No Minister Photos Only Students in Andhra Pradesh Education Department Ads

కూటమి ప్రభుత్వ రంగులు లేవు, ప్రచార ఆర్భాటాలు అసలే లేవు. అక్కడ కనిపిస్తున్నదల్లా 'ప్రభుత్వ విద్యాలయాలు సగర్వంగా నిలబడే' విజయ గర్వం మాత్రమే. ప్రతిభ చాటిన సామాన్య విద్యార్థుల ఫోటోలు, వారి స్కూళ్ల వివరాలు మాత్రమే ఆ ప్రకటనలో ప్రముఖంగా దర్శనమిచ్చాయి. భారత దేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వం తన ఫోటోలు లేకుండా, కేవలం విద్యార్థులనే హీరోలుగా చూపిస్తూ యాడ్ ఇవ్వడం ఇదే తొలిసారి.

నెంబర్ వన్ అని చెప్పుకోలేదు.. సాధించిందే చూపారు!

ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల తరహాలో 'మేమే నెంబర్ వన్' అని డబ్బా కొట్టుకోకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ప్రతిభను మార్కుల రూపంలో నిజాయితీగా ప్రజల ముందుంచారు. ఏసీ క్యాంపస్‌లు, ఒత్తిడితో కూడిన క్లాసులు కాకుండా.. 'అమ్మలా శిక్షణ - నాన్నలా రక్షణ' అనే నినాదంతో స్నేహపూర్వక బోధన మా బలం అని చాటి చెప్పారు. సుశిక్షితులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను ఈ ఫలితాల ద్వారా నిరూపించారు.

దటీజ్ నారా లోకేష్: చిన్నారి పునర్వికకు ఇంజెక్షన్
దటీజ్ నారా లోకేష్: చిన్నారి పునర్వికకు ఇంజెక్షన్

మహనీయుల స్ఫూర్తి.. పారదర్శక పాలన

పథకాలకు తన పేరో, తండ్రి పేరో పెట్టుకోకుండా.. విద్యా రంగానికి వెలుగులు పంచిన మహనీయుల పేర్లు పెట్టి లోకేష్ తన సంస్కారాన్ని చాటుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యహ్న భోజనం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, అంబేద్కర్‌, అబ్దుల్ కలాం పేర్లతో స్ఫూర్తిదాయక పథకాలు, విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులు, క్రీడా పరికరాలపై ఎక్కడా రాజకీయ నాయకుల బొమ్మలు ఉండకూడదని ఆయన ఇచ్చిన ఆదేశాలు అక్షరాలా అమలవుతున్నాయి. బడి గేటు లోపలికి రాజకీయాలకు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టించిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది.

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా వైజాగ్: నారా లోకేష్
ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా వైజాగ్: నారా లోకేష్

లోకేష్ అనుసరిస్తున్న ఈ పారదర్శకత, నిజాయితీతో కూడిన పనితీరు ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' కల సాకారం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+