అరుణాచలం వెళ్ళే భక్తులకు శుభవార్త చెప్పిన రైల్వే!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అరుణాచలం భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. గుంటూరు-తిరుపతి మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్‌ను (17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం దీర్ఘకాలంగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నిర్ణయంగా ఉంది.

శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లికి రైలు

మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగి ముందుకు సాగుతుంది. తిరుపతి తర్వాత చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు, అరణి రోడ్డు, పోలూరు, తిరువణ్ణామలై (అరుణాచలం), తిరుక్కోవైలూరు, విల్లుపురం, వృద్ధాచలం, అరియలూరు, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి చేరుకుంటుంది.

Good news to arunachalam devotees Guntur-Tirupati Express train extended up to Tiruchirappalli

అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త

ఈ పొడిగింపు వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బాగా ఉపయోగపడనుంది. అలాగే వెల్లూరులోని ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ శ్రీపురం మహాలక్ష్మి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలను సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటికే ఈ రైలును అరుణాచలం వరకు పొడిగించాలని భక్తులు, రాజకీయ నాయకులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య ప్రయాణాలు మరింత సౌకర్యవంతం

ఆ డిమాండ్ ఇప్పుడు నెరవేరడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త సర్వీస్ ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేస్తుంది. ముఖ్యంగా తిరుమల, తిరుపతి దర్శనం చేసుకొని అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు ఇది చాలా ముఖ్యమైన సౌకర్యం. రైల్వే శాఖ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో గుంతకల్లు స్టేషన్ నుంచి కొత్త రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి.

భారతదేశంలోనే 190కి.మీ ఓఆర్ఓర్ ఉన్న ఏకైక నగరంగా అమరావతి: సీఎం చంద్రబాబు
భారతదేశంలోనే 190కి.మీ ఓఆర్ఓర్ ఉన్న ఏకైక నగరంగా అమరావతి: సీఎం చంద్రబాబు

తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగింపు

గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య ప్యాసింజర్ రైలు (57407/57408) కొత్తగా మొదలైంది. అలాగే విశాఖపట్నం-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగించారు. ఈ నిర్ణయాలు రైలు ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ పొడిగింపు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు, భక్తులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా వార్షికంగా అరుణాచలం వెళ్లే వేలాది భక్తులకు ఇది పెద్ద ఊరటనిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+