ఎల్పీజీ వంటగ్యాస్ పై కేంద్రం అద్దిరిపోయే ఆఫర్: ఇకపై. !!

దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు తీపి కబురు అందింది. ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ మరింత వేగం పుంజుకొంది. ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ దిశగా కీలక అడుగు వేసింది. నూతన డిజైన్ తో కూడిన ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ (Indane XTRALITE NOW) కంపోజిట్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 కేజీల బరువు ఉండే ఈ సిలిండర్లను బుక్ చేసిన నాలుగు గంటల్లోనే ఇంటికి చేర్చేలా సరికొత్త ఎక్స్‌ప్రెస్ డెలివరీ విధానాన్ని ఇండెన్ అధికారికంగా ప్రారంభించింది.

ప్రస్తుతానికి ఈ ఎక్స్‌ప్రెస్ గ్యాస్ డెలివరీ.. పూణే, గుర్గావ్, ఇండోర్, కోయంబత్తూర్ లల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ సిస్టమ్ అమలు తీరు, దీనికి లభించే స్పందన ఆధారంగా త్వరలోనే దశలవారీగా ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రణాళికలు రచిస్తోంది. అతి తక్కువ సమయంలో గ్యాస్ సిలిండర్ పొందే ఈ అత్యాధునిక విధానం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందని చెబుతోంది.

Indane XTRALITE NOW Launch for 10 kg Lightweight LPG with Home Delivery in Just 4 Hours these cities

సాధారణంగా ఇళ్లలో వాడే ఐరన్ గ్యాస్ సిలిండర్ల కంటే ఈ కంపోజిట్ సిలిండర్లు తేలికగా ఉంటాయి. ఫైబర్ గ్లాస్ తో ఇవి తయారయ్యాయి. పారదర్శకంగా ఉంటాయి. వీటి బరువు చాలా తక్కువ. ఒక చోటి నుండి మరో చోటికి సులభంగా తీసుకెళ్లొచ్చు. ఫైబర్ గ్లాస్ ను వినియోగించడం వల్ల ఇవి తుప్పు పట్టవు. తయారీలో ఫైబర్ ను ఉపయోగించడం వల్ల సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందనేది బయటికి కనిపిస్తుంది కూడా.

ఈ ఎక్స్‌ప్రెస్ హోమ్ డెలివరీ 10 కేజీల సిలిండర్లకే పరిమితం చేయట్లేదని ఇండెన్ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వీధి వ్యాపారులకు అనువుగా ఉండే అయిదు కేజీల ఇండేన్ ఛోటు సిలిండర్లకు కూడా విస్తరించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మొబైల్ ద్వారా బుకింగ్ చేసిన నాలుగు గంటలలోపే ఈ చిన్న సైజు ఎల్‌పీజీ సిలిండర్ల నేరుగా ఇంటి వద్దకు తెప్పించుకోవచ్చు. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ లో వెసలబాటును కూడా కల్పించింది ఇండెన్. తమకు వీలైన సమయంలో మాత్రమే సిలిండర్ డెలివరీ అయ్యేలా తమకు నచ్చిన టైమ్ స్లాట్‌ను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇందులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+