విజయ్ కు AIADMK తాజా ఆఫర్, ఇదీ ఫార్ములా- కండీషన్స్: రేపే ముహూర్తం..!!

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు వేళ గవర్నర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పారు. ఇటు మద్దతు కోసం మూడు పార్టీలతో విజయ్ టీం చర్చలు చేస్తోంది. ఈ రోజు ఆ పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకే అలర్ట్ అయింది. కొత్త ప్లాన్ తో సిద్దం అవుతోంది. దీంతో...అన్నీ అనుకూలిస్తే రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం కనిపిస్తోంది.

విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా.. లేదా. ఈ అంశం ఈ రోజు తేలిపోనుంది. విజయ్ తనకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కూటమిలోని VCK, CPI, CPM పార్టీలను కోరుతున్నారు. మంత్రివర్గం లో ఆ మూడు పార్టీలకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ఆ మూడు పార్టీల నేతలు తమ నిర్ణయం వెల్లడించనున్నాయి. మద్దతు పైన సానుకూల నిర్ణయం తీసుకుంటే..మూడు పార్టీలకు ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఈ మూడు పార్టీల్లో ఒక్క పార్టీ అనుకూల నిర్ణయం తీసుకోకపోయినా.. తమ గేమ్ ప్లాన్ అమలు చేసేందుకు అన్నా డీఎంకే సిద్దంగా ఉంది. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేతో సమావేశమైన మాజీ సీఎం పళిని స్వామి తాము ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. అదే సమయంలో కొందరు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!
aiadmk-new-strategies-reshape-tamil-nadu-political-landscape-amid-uncertainty-here-the-details

అన్నీ అనుకూలిస్తే రేపు ప్రమాణ స్వీకారానికి అవకాశం

దీంతో, ఈ విషయం గమనించిన పళిని స్వామి కొత్త వ్యూహం సిద్దం చేసారు. అన్నా డీఎంకే ముఖ్య నేత ఒకరు నేరుగా టీవీకే తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. తాము బీజేపీతో కొనసాగే అవకాశం లేదని... అవసరమైతే పవర్ షేరింగ్ ఫార్ములాతో మద్దతు ఇచ్చేందుకు సిద్దమని ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, విజయ్ టీం ఈ ప్రతిపాదన పైన సానుకూలంగా లేదని సమాచారం. పవర్ షేరింగ్ ఫార్ములా కు విజయ్ వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో VCK, CPI, CPM పార్టీలు మద్దతు పైన నిర్ణయం వెల్లడించే వరకూ వేచి చూడాలని భావిస్తున్నారు. ఈ మూడు పార్టీల మద్దతు లభించినా... లేక, అన్నా డీఎంకే తో షరతులతో పొత్తు ఖాయమైనా రేపు (శనివారం) విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ సాయంత్రానికి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమా.. కాదా.. ఏం జరుగుతుందనేది స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+