ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్..!!
భారత్ లోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను జులై 2026 వరకు తగ్గించాలని నిర్ణయించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విమానయాన వ్యయంలో ఇంధనం వాటా దాదాపు 55 నుంచి 60 శాతానికి పెరిగింది. దాంతో భారత్ లోని విమానయాన రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల భారత్ లోని ప్రముఖ విమానయాన సంస్థలు ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశాయి. విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు పెరుగుదల కారణంగా పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని వ్యక్తం చేశాయి. తాము కార్యకలాపాలు సాగించే స్థితిలో లేమని ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు భరించలేనంతగా పెరిగాయని ఆవేదన తెలిపాయి.

ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ఇరాన్, కువైట్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో విమానాలు సాధారణ మార్గంలో కాకుండా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం సుమారు 2 నుంచి 4 గంటల వరకు పెరుగుతుంది. దాంతో విమానయాన సంస్థలు నష్టాలను చవి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రయాణికులు తమ ప్రయాణాలకు సంబంధించిన స్టేటస్ లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications