అదరగొట్టిన పోలీస్ డ్రామా..అసలు మిస్ కావద్దు
ఒకప్పుడు టాలీవుడ్‌లో 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'ఆనందం' వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా అలరించిన వెంకట్, ఇటీవల పవన్ కళ్యాణ్ 'OG'లో మెరిసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు 'హరుడు' అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!
కథ:
ముంబై మాఫియాను వణికించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ డిసిపి శంకర్ (వెంకట్) హైదరాబాద్‌కు బదిలీ అవుతాడు. నగరంలో అడుగుపెట్టిన క్షణం నుంచే నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా) తో శంకర్‌కు విభేదాలు మొదలవుతాయి. పైకి నీతిమంతుడిలా కనిపిస్తూ లోపల అక్రమ దందాలు చేసే ఎమ్మెల్యే అసలు రంగును శంకర్ ఎలా బయటపెట్టాడు? మరోవైపు, తమ కలలను సాకారం చేసుకోవడానికి కార్ ఇంజన్లు దొంగతనం చేసే కొందరు విద్యార్థుల కథ ఏమైంది? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు, ఈ గొడవలకు ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.

నటీనటుల ప్రతిభ:
చాలా కాలం తర్వాత హీరోగా కనిపించినా, వెంకట్ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరిచారు. పోలీస్ యూనిఫాంలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. కథానాయికగా నటాషా తన గ్లామర్‌తో మెప్పించగా, హెబ్బా పటేల్ పాత్ర సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.విలన్‌గా శ్రీహరి పైలా నటన బాగుంది. చాలా కాలం తర్వాత అలీ తన మార్కు కామెడీతో నవ్వించారు. ఇక ఐటమ్ సాంగ్‌లో సలోని మెరుపులు మాస్ ఆడియెన్స్‌కు కన్నుల పండుగే.
సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు కిరణ్ ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించారు. కథలో పాత వాసనలు ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు.
ప్లస్ పాయింట్స్:
వెంకట్ స్క్రీన్ ప్రెజెన్స్ ,యాక్షన్ సీక్వెన్స్.
వేగంగా సాగే స్క్రీన్ ప్లే (తక్కువ రన్ టైమ్).
ఇంటర్వెల్ ట్విస్ట్ , సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్.
మైనస్ పాయింట్స్:
ముందే ఊహించగలిగే క్లైమాక్స్.
కొన్ని పాతకాలపు సన్నివేశాలు.
తుది తీర్పు:
'హరుడు' ఒక పక్కా కమర్షియల్ పోలీస్ డ్రామా. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన ఈ చిత్రం సగటు సినీ ప్రేక్షకుడిని నిరాశపరచదు. మీరు పాత తరం యాక్షన్ సినిమాలను, వెంకట్ నటనను ఇష్టపడేవారైతే, వీకెండ్‌లో 'హరుడు'పై ఒక లుక్కేయొచ్చు!
ఫైనల్‌గా:
పాత సీసాలో కొత్త సీసం.. ఈ 'హరుడు' మాస్ ప్రేక్షకులకు వరం.
రేటింగ్ 2.75/5












Click it and Unblock the Notifications