బండి భగీరథ్ పోక్సోకేసు: బండి సంజయ్ పై ప్రచారం ఆపండి.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
బండి భగీరధ్ పోక్సో కేసు నేపధ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీల నాయకులకు టార్గెట్ అయ్యారు. భగీరధ్ పై పోక్సో కేసు నమోదు కావటంతో కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి పదవి నుండి ఆయన తప్పుకోవాలని తెలంగాణాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బండి భగీరథ్ కేసు నేపథ్యంలో చేస్తున్న దుష్ప్రచారం బండి సంజయ్ కు ఆవేదన కలిగిస్తుంది.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ
బండి భగీరథ్ కేసు నేపథ్యంలో చేస్తున్న దుష్ప్రచారం వెంటనే ఆపాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఇప్పటి వరకు ప్రసారం చేసిన అన్ని వీడియో క్లిప్పింగులు, పత్రికా కటింగులు, డిజిటల్ కంటెంట్‌లు, సోషల్ మీడియా పోస్టులు, వాల్ పోస్టర్లు తక్షణం తొలగించాలని పేర్కొంది.

26వ తేదీలోగా ఈ అన్ని కంటెంట్‌లను తొలగించకపోతే చట్టపరంగా చర్యలు
ఈ నెల 26వ తేదీలోగా ఈ అన్ని కంటెంట్‌లను తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తన ఉత్తర్వుల్లో ఇకపై బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎలాంటి దుష్ప్రచారం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాలు బండి సంజయ్ యొక్క సామాజిక, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ఇది న్యాయవ్యవస్థ దృష్టికి తీవ్రమైన విషయమని కోర్టు అభిప్రాయపడింది.
ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేసే విధంగా వీడియోలు, పోస్టర్లు, వార్తలు వ్యాప్తి
బండి సంజయ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు, ఆయనను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేసే విధంగా వీడియోలు, పోస్టర్లు, వార్తలు వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషనర్ అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కోర్టు ఉత్తర్వులు రాజకీయ నాయకులపై వ్యక్తిగత దుష్ప్రచారం చేసేవారికి బలమైన సందేశం అందిస్తున్నాయి.
చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక
బండి సంజయ్ అనుచరులు ఈ ఉత్తర్వులను స్వాగతించారు. ఇకపై ఆయనపై ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపధ్యంలో ఎవరైనా బండి సంజయ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications