టీవీకే ముందు మట్టికరిచిన టాప్ ఫిల్మ్ డైరెక్టర్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కు పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌ తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళన వెట్రి కజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేదీ అదే పరిస్థితి.

ఈ ఎన్నికల్లో ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సీ సైతం ఓటమి పాలయ్యారు. మధురై సెంట్రల్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి మదర్ బద్రుద్దీన్ చేతిలో మట్టికరిచారు. ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ఏఐఏడీఎంకే కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. పుదియ నీథి క‌చ్చి (పీఎన్కే) అభ్య‌ర్థిగా పోటీ చేశారు. సుందర్ తరఫున ఆయన భార్య, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు సెలెబ్రిటీలు ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. 23,636 ఓట్లు పడ్డాయి.

Film Director Sundar C Falls Short in Madurai Central Election Against TVK Madhar Badhurudeen

డీఎంకేకు చెందిన పళణివేల్ త్యాగరాజన్‌ ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. 16,592 ఓట్ల మెజారిటీతో టీవీకే అభ్యర్థికి పట్టం కట్టారు మధురై సెంట్రల్ ఓటర్లు. ఆయన మొత్తం 48,125 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది.. మొత్తం పోలైన ఓట్లలో 44.27 శాతం. త్యాగరాజన్ 31,533 ఓట్లు పోల్ అయ్యాయి. పీఎన్కే.. అన్నా డీఎంకే మిత్ర‌ప‌క్షం. 2001లో ఆర‌ణి చొక్క‌లింగం ష‌ణ్ముగం ఈ పార్టీని నెల‌కొల్పారు. ఈ ఎన్నిక‌ల్లో ఏఐఏడీఎంకేతో జ‌ట్టు క‌ట్టింది.

మధురై సెంట్రల్ నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. 78.89 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 ఎన్నికల్లో నమోదైన 61.03 శాతం పోలింగ్ కంటే అధికం. ఈ అదనపు ఓటింగ్ అంతా కూడా టీవీకేకు పోల్ అయ్యాయనడానికి తాజా ఫలితాలే నిదర్శనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+