మే 1 నుంచి LPG బుకింగ్స్ లో భారీ మార్పులు..? కొత్త రూల్స్ ఇవే..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో చమురు సరఫరాలో ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరా సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ అవసరాలకు ఎల్పీజీ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99 శాతానికి చేరుకున్నాయని స్పష్టం చేసింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5 శాతానికి చేరినట్లు పేర్కొంది. అంతేకాక పీఎన్‌జీ కనెక్షన్ల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోని ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.

మరోవైపు మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్ లో మార్పులు రాబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కొత్త రూల్స్ బుకింగ్స్ ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు రానున్నట్లు సమాచారం. అలాగే సిలిండర్ బుకింగ్స్ లోనూ మార్పులు రానున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లో 25 రోజుల గ్యాప్ కచ్చితంగా ఉండేలా చూస్తున్నట్లు సమాచారం. అలాగే ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇకపై పర్మనెంట్ చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్- జులై నాటికి డెలివరీ పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్ కు 80 వేల టన్నుల ఎల్పీజీ రోజూ అవసరం పడుతోంది. అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రం రోజుకు 46వేల టన్నులు మాత్రమే ఉంది.

LPG Supply Normal Nationwide as Online Bookings Hit 99 Good News for Consumers LPG bookings now

అలాగే ఇటీవల ప్రభుత్వ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒక నెల రోజుల పాటు కొత్త గ్యాస్ కనెక్షన్స్ జారీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలిక నిలిపివేత మాత్రమేనని ఒక్కసారి దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ నిబంధనను తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+