ముంబైలో రూ.1,745 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ సీజ్!

భారతదేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాప క్రింద నీరులా విస్తరిస్తోంది. ముంబయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను విజయవంతంగా ఛేదించింది. ఈ కీలక ఆపరేషన్‌లో రూ. 1,745 కోట్ల విలువైన 349 కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను NCB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీగా డ్రగ్స్ పట్టుబడటంమన దేశంలో డ్రగ్స్ విస్తరిస్తున్న తీరుకు అద్దం పడుతుంది.

డ్రగ్స్ పట్టుబడిన విషయాన్ని వెల్లడించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

నేడు ముంబై కేంద్రంగా డ్రగ్స్ పట్టుబడిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విజయాన్ని వెల్లడించారు. “మాదకద్రవ్యాల ముఠాలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వం దృఢ నిర్ణయం. ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్‌ను పట్టుకోవడం బాటమ్ టు టాప్ అప్రోచ్‌కు ఉదాహరణ” అని అమిత్ షా పేర్కొన్నారు.

NCB Mumbai Seizes Cocaine Worth 1745 Crore International drugs syndicate busted in india amit shah tweet

దావూద్ ఇబ్రహీం అనుచరుడు మహమ్మద్ సలీమ్ డోలా అరెస్ట్ తర్వాత ఘటన

NCB బృందాన్ని అభినందించిన షా, మాదకద్రవ్యాల రవాణా మరియు వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను మరింత పెంచిన విషయం ఏమిటంటే – ఇటీవలే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు మహమ్మద్ సలీమ్ డోలాను తుర్కియే నుంచి భారత్‌కు తీసుకువచ్చి NCB అధికారులు అరెస్టు చేశారు.

'డ్రగ్-ఫ్రీ ఇండియా’ మిషన్‌లో మరో ముఖ్యమైన విజయం

ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయిన సలీమ్ డోలా అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తి. ఈ సమయంలో ఇంత పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కీలకంగా మారింది. ఈ ఘటన మాదకద్రవ్యాల నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'డ్రగ్-ఫ్రీ ఇండియా’ మిషన్‌లో మరో ముఖ్యమైన విజయంగా పరిగణించబడుతోంది.

గతంలోనూ 5,560 కిలోల డ్రగ్స్ స్వాధీనం

యువతను మాదకద్రవ్యాల వలయం నుంచి రక్షించడం కోసం NCB నిరంతరం కృషి చేస్తోంది. 2025లో మాత్రమే NCB ముంబయి యూనిట్ సుమారు 5,560 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. దేశవ్యాప్తంగా 2025లో 1.33 లక్షల కిలోల డ్రగ్స్ సుమారు రూ.2,000 కోట్లు విలువ ఉన్నవి పట్టుబడ్డాయి. ప్రధాని మోదీ 'నషా ముక్త్ భారత్’ లక్ష్యంతో ప్రభుత్వం డ్రగ్ కార్టెల్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవలి డ్రగ్స్ పై నార్కోటిక్స్ మోపుతున్న ఉక్కుపాదం ఈ దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+