విజయ్ రాజీనామా అల్టిమేటం, స్టాలిన్ ఊహించని నిర్ణయం - లైన్ క్లియర్..!!

తమిళనాడు రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. విజయ్ మెజార్టీ నిరూపణ చేసే వరకూ ప్రభుత్వం ఏర్పాటు కు ఆహ్వానించలేనని గవర్నర్ తేల్చి చెప్పేసారు. మూడు పార్టీలు ఈ రోజు విజయ్ కు మద్దతు పైన నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. ఆ మూడు పార్టీలు ముందుకు వస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే డీఎంకే- అన్నా డీఎంకే కూటమిగా ప్రయత్నాలు తీవ్రం కానున్నాయి. అదే జరిగితే 107 మంది ఎమ్మెల్యే లతో రాజీనామాకు సిద్దమని విజయ్ ప్రకటించారు. ఈ సమయంలో స్టాలిన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. విజయ్ కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే.

విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఆరుగురు ఎమ్మెల్యే మద్దతు కావాలి. ఇప్పటికే టీవీకే నేతలు ఈ ఆరుగురు మద్దతు కోసం వీసీకే, ఉభయ కమ్యూనిస్టులతో చర్చలు చేసారు. ఆ మూడు పార్టీలకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ముందుకు వస్తే రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారు ముందుకు రాకుండా.. డీఎంకే- అన్నా డీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నలు జరిగితే.. తన మొత్తం ఎమ్మెల్యేలతో విజయ్ రాజీనామాకు సిద్దమయ్యారు. దీంతో.. ఈ పరిణామాల పైన మాజీ సీఎం స్టాలిన్ వేగంగా స్పందించారు. డీఎంకే కూటమిలోని వీసీకే, కమ్యూనిస్టు నేతలకు స్పష్టత ఇచ్చారు. తాము విజయ్ తో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములు కాలేమని.. ఈ మూడు పార్టీలు విజయ్ కు మద్దతు ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతూనే.. భవిష్యత్ పైనా ఆలోచన చేయాలని సూచించారు.

సంచలన నిర్ణయాలు తప్పవు, ఎమ్మెల్యేలతో తేల్చేసిన స్టాలిన్- హంగ్ వేళ బిగ్ ట్విస్ట్..!!
సంచలన నిర్ణయాలు తప్పవు, ఎమ్మెల్యేలతో తేల్చేసిన స్టాలిన్- హంగ్ వేళ బిగ్ ట్విస్ట్..!!
Stalin said the DMK will allow TVK chief Vijay to run the new government without disturbance amid political uncertainty

ఆ మూడు పార్టీలు ముందుకొస్తేనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు

ఇదే సమయంలో అన్నా డీఎంకేతో కలిసే అవకాశాలను స్టాలిన్ తోసిపుచ్చారు. తాము విజయ్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోబోమని తేల్చి చెప్పారు. టీవీకే అధినేత విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ఆరు నెలల వరకు వేచి చూస్తామని స్టాలిన్‌ ప్రకటన చేసారు. తమిళనాట రాజ్యాంగ సంక్షోభం రాకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా విజయ్ కు సానుభూతి పెరిగి.. భవిష్యత్ లో తమ పార్టీకి సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు.

దీంతో.. కాంగ్రెస్ తో మాత్రం తాము విభేదిస్తున్నామని.. తమ కూటమిలోని పార్టీలు విజయ్ కు మద్దతు ఇస్తే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. దీంతో.. ఇప్పుడు ఆ మూడు పార్టీల నేతలు సమావేశం అయ్యారు. విజయ్ కు మద్దతు పైన స్పష్టత ఇవ్వనున్నారు. సానుకూలంగా నిర్ణయం వస్తే విజయ్ ప్రమాణ స్వీకారం రేపు (శనివారం) ఉండే అవకాశం ఉంది. లేని పక్షంలో తమిళనాట ఊహించని రాజకీయ సమీకరణాలు తెర పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+