సీఎంగా విజయ్..గవర్నర్ ఆమోదం-ప్రమాణ స్వీకారం..కండీషన్స్ అప్లై!!
ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమైంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. రెండు రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఈ రోజు గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. తనకు ఉన్న సంఖ్యా బలం గురించి వివరించారు. తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటు వేళ మెజార్టీ నిరూపణకు సిద్దం కావాలని.. గవర్నర్ విజయ్ కు సూచించారు. 20 మంది మంత్రులతో విజయ్ సీఎంగా ప్రభుత్వం కొలువు తీరనుంది.
తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించుతూ గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు లోక్ భవన్ లో గవర్నర్ తో విజయ్ రెండో సారి సమావేశం అయ్యారు. తనకు ఉన్న మద్దతు గురించి వివరించారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని కోరారు. సభలో తాను మెజార్టీ నిరూపించుకుంటా నని చెప్పారు.

గవర్నర్ తో భేటీ వేళ మెజార్టీ పై విజయ్ క్లారిటీ
దీంతో.. లిఖిత పూర్వకంగా విజయ్ ఇచ్చిన లేఖతో గవర్నర్ సానకూలత వ్యక్తం చేసారు. న్యాయ సలహా తీసుకున్న తరువాత అధికారిక సమాచారం ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తే కొన్ని కండీషన్ల పైన స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, అన్నీ అనుకూలిస్తే 20 మంది మంత్రులతో విజయ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు లో టీవీకే కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. విజయ్ బుధవారం కలిసిన సమయంలో తన పార్టీ నుంచి 107, కాంగ్రెస్ నుంచి నలుగురి మద్దతు గురించి గవర్నర్ కు వివరించారు. తమకు 111 మంది సభ్యుల మద్దతు ఉందని.. సభలో బల నిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. కాగా.. గవర్నర్ మెజార్టీకి కావాల్సిన సంఖ్య పైన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో.. విజయ్ ప్రమాణ స్వీకారం పైన డైలమా నెలకొంది. తాజాగా మరోసారి గవర్నర్ తో భేటీ అయిన విజయ్.. తనకు మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలను వెల్లడించారు. సభలో బల నిరూపణకు సిద్దమని వివరించారు. ఈ మేరకు గవర్నర్ కు కొత్తగా అయ్యే మంత్రుల వివరాలతో పాటుగా.. మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేల లెక్కలను గవర్నర్ కు వివరించారు. దీంతో, విజయ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు గవర్నర్ సానుకూలంగా ఉండటంతో ఈ రోజే విజయ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రాగానే... ప్రభుత్వం ఏర్పాటు పైన విజయ్ ప్రకటన చేయనున్నారు.













Click it and Unblock the Notifications