IPL 2026 Playoffs: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు- ఆ 3 జట్లకు 80 శాతం ఛాన్స్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ప్లేఆఫ్ దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో మ్యాచ్ లు దాదాపు చివరి దశకు చేరుకుంటుండటంతో ఇక ప్లేఆఫ్స్ కు చేరేదెవరన్న ఉత్కంఠ పెరుగుతోంది. అదే సమయంలో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఆయా జట్లు సాధించిన పాయింట్లు, ఇక మిగిలిన మ్యాచ్ ల్లో గెలిస్తే ఏమవుతుంది, ఓడితే ఏమవుతుందన్న లెక్కలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆప్స్ రేసుకు అర్హత సాధించే అవకాశం ఉన్న మూడు కీలక జట్లు, నాలుగో బెర్త్ పై అంచనాల్ని ఓసారి చూసేద్దాం..

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు (IPL 2026 Playoffs) రేసు మరింత రసవత్తరంగా మారబోతోంది. రెండు వారాల్లో గ్రూప్ దశ ముగుస్తున్నా ఇంకా ఏ జట్టూ ప్లేఆఫ్స్ కు అధికారికంగా ఇంకా అర్హత సాధించలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో వెనుకబడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (రెండూ 11 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (12 మ్యాచ్‌లలో 10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (10 మ్యాచ్‌లలో 9 పాయింట్లు) కు కూడా అవకాశం ఉంది.

IPL 2026 Playoffs Scenarios Three Teams at 80 Qualification Odds as CSK RR Hover Around 42

2022లో ఐపీఎల్ 10-జట్ల టోర్నమెంట్‌గా మారాక ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడానికి 16 పాయింట్లను సాధారణంగా కీలకమైన సంఖ్యగా పరిగణిస్తున్నారు. ఐపీఎల్ అధికారిక ప్రసారకర్తల ప్రకారం నిన్న మ్యాచ్ తర్వాత 2026లో అర్హత సాధించడానికి గుజరాత్, ఆర్సీబీ, సన్ రైజర్స్ కు 80 శాతం అవకాశం ఉంది. తదుపరి దశకు వెళ్లేందుకు పంజాబ్ కింగ్స్ (62.5 శాతం), సీఎస్కే (42.7 శాతం), ఆర్ఆర్ (41.8 శాతం) ఫేవరెట్లుగా ఉన్నాయి. కేకేఆర్ (11.6 శాతం) మరియు డీసీ (1.2 శాతం)లకు కఠినమైన సవాలు తప్పేలా లేదు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే నిష్క్రమించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+