బీజేపీ మరో వికెట్ - AIADMKచీలికపై కాంగ్రెస్ సంచలన ట్వీట్..!
తమిళనాడులో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన అన్నాడీఎంకే(AIADMK) ఇప్పుడు చీలికకు సిద్దంగా ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, సీఎం విజయ్ ను సమర్దిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం స్పీకర్ ను, విజయ్ ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించబోతున్నారు. తాజా పరిణామాలపై విజయ్ ప్రభుత్వ భాగస్వామి అయిన కాంగ్రెస్ (Congress) స్పందించింది.
దేశవ్యాప్తంగా ఉన్న తమ మిత్రపక్షాల్ని నాశనం చేసుకుంటూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు తమిళనాడులో వారి మిత్రపక్షమైన అన్నాడీఎంకేను చీల్చి బలహీనం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. అన్నాడీఎంకేను నాశనం చేయాలన్న బీజేపీ చిరకాల స్వప్నం ఇవాళ నెరవేరుతోందన్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి ప్రజల అభిమానాన్ని చూరగొన్న బలమైన నాయకుల నేతృత్వంలో ఉన్న ఆ పార్టీ మరోసారి చీలిక అంచుకు చేరుకుందన్నారు.

அதிமுகவை அழிக்க வேண்டும் என்ற பாஜகவின் நீண்டநாள் கனவு இன்று நனவாகிக் கொண்டிருக்கிறது.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 12, 2026
எம்.ஜி.ஆர்., ஜெயலலிதா போன்ற மக்களால் நேசிக்கப்பட்ட வலுவான தலைவர்களால் வழிநடத்தப்பட்ட கட்சி இன்று மீண்டும் பிளவின் விளிம்பில் நிற்கிறது.
இந்திய அரசியலில் பாஜகவுடன் கூட்டணி வைத்த பல பிராந்திய…
భారత రాజకీయాల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అనేక ప్రాంతీయ పార్టీలకు ఏమైందో దేశం చూసిందని మాణిక్కం ఠాకూర్ తెలిపారు. శివసేన విచ్ఛిన్నమైందని, జేడీ(యూ) బలహీనపడిందని, తదుపరి లక్ష్యం అన్నాడీఎంకేనా అనే ప్రశ్న నేడు తలెత్తుతోందన్నారు. ముందుగా మిత్రులను నాశనం చేసి, ఆ తర్వాత వారి స్థానాన్ని ఆక్రమించడమే బీజేపీ రాజకీయ విధానం అని మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. పరాన్నజీవి రాజకీయాలు" మరోసారి రుజువయ్యాయని బీజేపీపై మాణిక్కం ఠాకూర్ విమర్శలు గుప్పించారు.














Click it and Unblock the Notifications