విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!
విశాఖపట్నం నుంచి అయోధ్య వెళ్లే భక్తుల కోసం దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railay) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి ప్రయాగ్ రాజ్ కు, అలాగే తిరిగి ప్రయాగ్ రాజ్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించేలా ప్రత్యేక రైళ్లను (Visakhapatnam-Prayagraj Special Trains) ప్రకటించింది. ఈ రైళ్లు ఏయే తేదీల్లో రాకపోకలు సాగిస్తాయి, ఏయే స్టేషన్లలో ఆగుతాయన్న వివరాలను దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ - మంగళూరు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ఈ నెల 14 నుంచి విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. ఇందులో ప్రయాగ్ రాజ్ నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక రైలు (నంబర్ 04159) ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది. అలాగే విశాఖపట్నం నుంచి ప్రయాగ్ రాజ్ కు ప్రత్యేక రైలు (నంబర్ 04160) ప్రతీ శనివారం బయలుదేరుతుంది. ఈ రెండు రైళ్లూ మరుసటి రోజు గమ్య స్ధానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్ల ద్వారా అయోధ్య యాత్రకు భక్తులు వెళ్లి వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.

ప్రయాగ్ రాజ్-విశాఖపట్నం రైలు ప్రయాగ్ రాజ్ లో శుక్రవారం ఉదయం 10.15కు బయలుదేరుతుంది. అలాగే ఇది శనివారం మధ్యాహ్నం 1.30కు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రత్యేక రైలు ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.40కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఇది ఆదివారం సాయంత్రం 5.30కు ప్రయాగ్ రాజ్ చేరుకుటుందని అధికారులు తెలిపారు. ఏపీలో విశాఖలో బయలుదేరే ప్రత్యేక రైలుకు విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లలో స్టాప్ లు ఉన్నాయి. ఈ రెండు రైళ్లకు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో కానీ, ఎన్టీఈఎస్ యాప్ లో కానీ, నేరుగా కానీ అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకోవచ్చు.



Click it and Unblock the Notifications