"ప్రతీ ఎఫ్ఐఆర్ నాకు మెడలే-టార్గెట్ 100"- రాహుల్ వ్యాఖ్యలు..!

ఎస్ఐఆర్ లో అక్రమాల వ్యవహారంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ నిన్నటి నుంచి దేశవ్యాప్త నిరసనలు ప్రారంభించిన ఇండియా కూటమి పార్టీలు ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన ఈ భేటీలో తదుపరి కార్యాచరణపై చర్చించాయి. అనంతరం ఆందోళనలు కొనసాగించేందుకు జంతర్ మంతర్ కు బయలుదేరి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!
సీఈసీ నిర్ణయాల్ని సుప్రీం రద్దు చేస్తుందా ? గతంలో ఇందిర సహా 6 ఎన్నికలపై స్టేలు..!

తనపై, ఇతర ఎంపీలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల పట్ల తాను కలవరపడం లేదని, ఇప్పటికే తాను 45 ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొన్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లను స్వాగతిస్తానని, ఆ సంఖ్య 100కి చేరాలని తాను కోరుకుంటున్నానని, ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఒక పతకంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఐక్యంగా పోరాడుతోందని, ప్రజల హక్కులను పరిరక్షించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కేసులు కావాలంటే అన్ని పెట్టవచ్చని, కానీ ప్రతిపక్షం బెదిరిపోదని ఆయన అన్నారు.

Rahul Gandhi Says FIRs Are Medals for Him Wants Number to Reach 100
ధర్నా కొనసాగిస్తున్న రాహుల్, ప్రియాంక..! స్పందించిన ఈసీ వర్గాలు..!
ధర్నా కొనసాగిస్తున్న రాహుల్, ప్రియాంక..! స్పందించిన ఈసీ వర్గాలు..!

మోదీ ఈసీతో కూడా తప్పులు చేయిస్తున్నారంటూ మల్లి ఖార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. కాబట్టి తమ డిమాండ్లు నెరవేరే వరకు జంతర్ మంతర్ వద్ద సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు నిరసన కొనసాగిస్తాయని ఆయన తేల్చిచెప్పారు. అటు ఇండియా కూటమితో పాటు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టేందుకు ఈసారి కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్ధి సంఘాలు కూాడా కలిసి వస్తున్నాయి. అక్టోబర్ 10న చేపట్టే మహాధర్నాతో ఆందోళనల్ని ఉధృతం చేసేందుకు సిద్మవుతున్నారు. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు మరోసారి ఢిల్లీలో వేడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈసీతో కేంద్రం రాజీనామా చేయిస్తుందా, కొనసాగిస్తూ మొండిపట్టు ప్రదర్శిస్తే విపక్షాలు తదుపరి దశలో ఏం చేయబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+