బీజేపీ ఆపరేషన్ తెలంగాణ షురూ- ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు..!!

బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టింది. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిషన్ 2028 లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. పార్లమెంట్ సమావేశా ల వేళ పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా సమాచారం అందింది. ఈ మేరకు ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ చీఫ్ కీలక భేటీ ఏర్పాటు చేసారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటుగా 2028 అసెంబ్లీ ఎన్నికల దిశగా రోడ్ మ్యాప్ ఫిక్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతల మధ్య విభేదాల పైన పార్టీ సీనియర్ గా స్పందించింది.

తెలంగాణ పై బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. పార్టీలో ని కీలక నేతల మధ్య ఉన్న విభేదాల పైన సీరియస్ గా ఉన్న పార్టీ కొత్త వ్యూహాలు అమలు చేస్తూ.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సమక్షంలో ఎంపీలు ఈటల- మంత్రి బండి సంజయ్ కలిసి పని చేసే విధంగా ఒప్పందం చేసారు. ఇద్దరం కలిపి పని చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఢిల్లీలో బండి సంజయ్ నివాసంలో ఈటల రాజేందర్, పార్టీ ఎంపీలు విందుకు హాజరయ్యారు. పార్టీ నాయకత్వం ఇదే సమయంలో కీలక భేటీకి నిర్ణయించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.

 శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్- క్యూ లైన్లలో ఇక నుంచి కొత్తగా, నో వెయిటింగ్..!!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్- క్యూ లైన్లలో ఇక నుంచి కొత్తగా, నో వెయిటింగ్..!!
bjp-leader-ship-moving-with-new-plans-in-telangana-with-target-2028-key-discussions-in-delhi

పార్టీ చీఫ్ కీలక సమావేశం.. దిశా నిర్దేశం

ఈ సమావేశంలో జాతీయ నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్ తోపాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. గతంలోనే రాష్ట్ర పార్టీ నేతల మధ్య ఐక్యత అంశం పైన హోం మంత్రి అమిత్ షా సహ పలువురు పార్టీ ముఖ్య నేతలు సూచించారు. అయినా.. మార్పు రాకపోవటం పైన పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగానే పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. తాజా సమావేశంలో తెలంగాణ లో రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలను నేరుగా హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రం లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ముందుగా గ్రేటర్ లో జరిగే ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని భావిస్తోంది. దీంతో.. బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+