16 ఏళ్ల క్రితం హీరోయిన్.. ఇప్పుడు హీరో!

ప్రఖ్యాత క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం "ది ఒడిస్సీ" ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రఖ్యాత కెనడియన్ నటుడు ఇలియట్ పేజ్ యోధుడు సినోన్ పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే క్రిస్టోఫర్ నోలన్, ఇలియట్ పేజ్ ఇంతకు ముందే 16 ఏళ్ల క్రితం ఓ సినిమాలో కలిసి పనిచేశారు. 2010లో వచ్చిన "ఇన్సెప్షన్" చిత్రంలోనూ వీరు కలిసి పనిచేశారు. కానీ ఆ సమయంలో ఇలియట్ పేజ్ లింగ గుర్తింపు, రూపం పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం.

Korean Kanakaraju Review:సత్య నవ్వించాడు..కనకరాజు ఆకట్టుకున్నాడా..?
Korean Kanakaraju Review:సత్య నవ్వించాడు..కనకరాజు ఆకట్టుకున్నాడా..?

ఎలెన్ నుంచి ఇలియట్‌గా..
2010లో "ఇన్సెప్షన్" చిత్రం విడుదలైన సమయంలో ఇలియట్ పేజ్ పేరు ఎలెన్ పేజ్. ఆ సినిమాలో ఆమె గ్రాడ్యుయేట్ విద్యార్థిని అరియాడ్నే పాత్రను పోషించారు. అప్పట్లో ఆమె లింగ గుర్తింపు స్త్రీగా ఉండేది. అయితే గడిచిన 16 ఏళ్లలో ఎలెన్ పేజ్ జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. 2020లో కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తనను తాను సరిగ్గా అర్థం చేసుకున్న ఎలెన్ పేజ్.. తాను ట్రాన్స్‌జెండర్ పురుషుడినని బహిరంగంగా ప్రకటించి తన పేరును ఇలియట్ పేజ్ గా మార్చుకున్నారు.

Elliot Page Journey in Christopher Nolan Films 16 Years Ago Actress Now Actor Full Details Here

పురుషుడిగా మారిన తర్వాత ఇలియట్ పేజ్ 'రొమ్ము కణజాలాన్ని తొలగించే శస్త్రచికిత్స'(టాప్ సర్జరీ) చేయించుకున్నారు. ఈ మార్పు ద్వారా తన జీవితంలో మొదటిసారిగా తన స్వశరీరంలో పూర్తి సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా అనిపించిందని ఆయన వెల్లడించారు. ఓప్రా విన్‌ఫ్రే టాక్ షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఇలియట్ పేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. స్నానం చేసిన తర్వాత అద్ధంలో తనను తాను చూసుకున్నప్పుడు భయం గానీ, అసౌకర్యం గానీ లేకుండా ఆనంద భాష్పాలు వచ్చాయని వెల్లడించారు.

స్టెరాయిడ్స్ ఎఫెక్ట్: పెద్ద సినిమాలను పక్కన పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో!
స్టెరాయిడ్స్ ఎఫెక్ట్: పెద్ద సినిమాలను పక్కన పెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో!

ట్రాన్స్‌జెండర్ పురుషుడిగా మారకముందు 2014లో ఇలియట్ పేజ్ తనను తాను లెస్బియన్ గా ప్రకటించుకున్నారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లపై వచ్చే విమర్శలు, అపహాస్యాలను చూసిన తర్వాతే తన నిజమైన గుర్తింపును ధైర్యంగా ప్రపంచానికి వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎల్జీబీటీక్యూ సమాజం హక్కుల కోసం వారి మానసిక ఆరోగ్యంపై నిరంతరం గళం విప్పుతున్న ఇలియట్ పేజ్.. తన జీవిత విశేషాలు, లింగ మార్పిడి అనుభవాలు, హాలీవుడ్ ప్రయాణాన్ని వివరిస్తూ 'పేజ్‌బాయ్' పేరుతో ఓ ఆత్మకథను కూడా రచించారు.

ఇలియట్ పేజ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2018లో కొరియోగ్రాఫర్ ఎమ్మా పోర్ట్నర్ ను వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నప్పటికీ.. వారిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారు. కేవలం 10 ఏళ్ల చిన్న వయస్సులోనే నటనారంగ ప్రవేశం చేసిన ఇలియట్ పేజ్.. జూనో, ఇన్సెప్షన్, ఎక్స్-మెన్ సిరీస్, హార్డ్ క్యాండీ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల ద్వారా హాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+