పసిడి ధరల్లో భారీ బుల్ ట్రెండ్

అమెరికా-ఇరాన్ యుద్ధంతో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల మధ్య నేడు బంగారం ధరల బుల్ ట్రెండ్ కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ. 1,53,999 వద్ద లాభాలతో ఓపెన్ అయ్యి, కొద్ది నిమిషాల్లోనే రూ. 1,54,243 గరిష్ట స్థాయికి చేరింది. దీంతో ఇంట్రాడే 580 లాభాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. కామెక్స్ లో ఔన్సుకు 4,730 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇది.. సానుకూల ధోరణిని సూచిక.

ఎంసీఎక్స్ లో బంగారం 1,55,000 రూపాయలను దాటితే దీనికి హద్దులు ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,00- రూ. 1,65,000 స్థాయిలకు చేరగలదని భావిస్తోన్నారు. కామెక్స్ లో కూడా బంగారం 4,680 డాలర్లపైకి ఎగబాకితే అది 4,750- 4,800 డాలర్ల స్థాయిని అందుకోవచ్చు.

MCX Gold Price Jumps with Upside Gap 24K to Rs 153999 and Intraday High Near Rs 154243 Per 10g

ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,40,100, 24 క్యారెట్లు రూ. 1,53,280 వద్ద ట్రేడ్ అవుతోంది. అహ్మదాబాద్, పుణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,39,950, 24 క్యారెట్లు రూ. 1,53,180 కాగా ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,40,000, 24 క్యారెట్లు రూ. 1,54,130గా నమోదయ్యాయి. దేశంలో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,633, 22 క్యారెట్లు - రూ. 14,330, 18 క్యారెట్లు - రూ. 11,950

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,398, 22 క్యారెట్లు- రూ. 14,115, 18 క్యారెట్లు - రూ. 11,549

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,398, 22 క్యారెట్లు- రూ. 14,115, 18 క్యారెట్లు - రూ. 11,549

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,398, 22 క్యారెట్లు- రూ. 14,115, 18 క్యారెట్లు - రూ. 11,549

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,398, 22 క్యారెట్లు- రూ. 14,115, 18 క్యారెట్లు - రూ. 11,549

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,398, 22 క్యారెట్లు- రూ. 14,115, 18 క్యారెట్లు - రూ. 11,549

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+