సీఎం విజయ్ చేతికి అన్నా డీఎంకే, బలపరీక్ష వేళ ఊహించని రాజకీయం..!!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో బల పరీక్షకు సిద్దం అవుతున్న వేళ అన్నా డీఎంకే చీలిపోయింది. పళిని స్వామికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన షణ్ముగం తమ మద్దతు విజయ్ కే అని స్పష్టం చేసారు. ఎన్డీఏతో తమకు సంబంధం లేదని ప్రనకటించారు. పార్టీ వరుస ఓటములకు పళని స్వామనే కారణమని ఆరోపణ లు చేస్తూ.. బల పరీక్ష వేళ తాము విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమకు ఎన్డీఏ- అన్నా డీఎంకే తో సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అన్నా డీఎం‌కే నిలువునా చీలిపోయింది. పళిని స్వామికి వ్యతిరేకంగా గుర్రుగా ఉన్న షణ్ముగ వర్గం తమదే అసలైన అన్నా డీఎంకే గా ప్రకటించుకుంది. ఎన్డీఏలో తాము కొనసాగమని ప్రకటించింది. ఇదే సమయంలో విజయ్ కు మద్దతు ఇస్తున్నట్లు షణ్ముగం స్పీకర్ క లేఖ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. షణ్ముగ వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. విజయ్​ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అన్నాడీఎంకే మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ నేత సీవీ షణ్ముగం వెల్లడించారు. డీఎంకేకు వ్యతిరేకంగానే అన్నాడీఎంకే పార్టీని స్థాపించామని చెప్పారు. దాదాపు 53 ఏళ్లుగా తమ పోరాటం డీఎంకేకు వ్యతిరేకంగానే సాగిందన్నారు. ఈ క్రమంలోనే డీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది.

 IT కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం, వీరికి తప్పనిసరి - ఈ సారి కొత్త విధానాల్లో...!!
IT కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం, వీరికి తప్పనిసరి - ఈ సారి కొత్త విధానాల్లో...!!
AIADMK Shanmugam team announces support for CM Vijay ahead floor test in Assembly

ప్రభుత్వానికి మద్దతుగా

విజయ్ ప్రభుత్వానికి మద్దతుగాఅయితే, దీనికి పార్టీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారు. ఒకవేళ డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే పార్టీ పని ముగిసిపోతుందనే ఆందోళన వ్యక్తం అయింది.. అందుకే అలాంటి పరిస్థితులు తలెత్తకుండా అడ్డుకున్నామని చీలక నేతలు చెబుతున్నారు. ప్రస్తుతానికి మేం ఎలాంటి కూటమిలో లేమని వెల్లడించారు. పార్టీని బలోపేతం చేయడమే ముందున్న లక్ష్యమని స్పష్టం చేసారు. మాజీ మంత్రి ఎస్​పీ వేలుమణి శాసనసభలో అన్నాడీఎంకే పక్షనేతగా వ్యవహరిస్తారు. సీ విజయ్​ భాస్కర్ విప్ ​​గా ఉంటారు. ఇందుకు సంబంధించిన లేఖను ఇప్పటికే ప్రొటెం స్పీకర్​ కు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+