మళ్ళీ పోలవరంపై రగడ..ఏపీ పనులు ఆపాలని పీపీఏకు తెలంగాణా లేఖ!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు వివాదం మళ్లీ రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఫేజ్-2 పనులను తక్షణం నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ సర్వే పూర్తి కాకుండా ఏపీ పనులు చేపట్టొద్దు

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై పూర్తి స్థాయి సర్వే పూర్తి కావాలని, ఆ తర్వాతే మరిన్ని నిర్మాణ పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రాచలం సహా పలు ప్రాంతాలు ముంపుకు గురవుతాయని, దీని వల్ల స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. 36 వాగుల డ్రైనేజ్ వ్యవస్థపై వివరణాత్మక అధ్యయనం చేయకుండా ఏ పనులు చేపట్టకూడదని డిమాండ్ చేసింది.

Telangana Govt objected Polavaram Project Phase-2 works and has written a letter to the PPA to stop ap

పోలవరం పనులపై తెలంగాణా తీవ్ర అభ్యంతరం

పోలవరం లిఫ్ట్ స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించడంపై తెలంగాణ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ఈ పనులు చేపడుతోందని ఆరోపించింది. లిఫ్ట్ స్కీమ్ పనులను వెంటనే ఆపివేయాలని, ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పీపీఏకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఏకపక్ష చర్యలు అంతర్ రాష్ట్ర జలవనరుల ఒప్పందాలను ఉల్లంఘిస్తాయని తెలంగాణ వాదిస్తోంది.

చంద్రబాబు పోలవరం కోసం కేంద్రానికి విజ్ఞప్తి

ఈ వివాదం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయాలని, గోదావరి పుష్కరాల సమయానికి పూర్తి చేయాలని కోరారు. కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచడానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని, 2011 స్టాప్ వర్క్ ఆర్డర్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు.

ఔషధి ఎక్స్‌ప్రెస్‌.... హైదరాబాద్ నుండి ముంబైకి తొలి ప్రత్యేక ఫార్మసీ రైలు,ఫార్మాకి రెక్కలు!
ఔషధి ఎక్స్‌ప్రెస్‌.... హైదరాబాద్ నుండి ముంబైకి తొలి ప్రత్యేక ఫార్మసీ రైలు,ఫార్మాకి రెక్కలు!

రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక వివాదంగా పోలవరం

పోలవరం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక వివాదంగా మారింది. తెలంగాణ తన సరిహద్దు ప్రాంతాల్లో ముంపు, వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ఆందోళన చెందుతోంది. సరైన సర్వే, అధ్యయనాలు లేకుండా పనులు కొనసాగితే పర్యావరణం, స్థానికుల జీవనం దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఏపీపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+