తమిళనాడులో కౌంటింగ్ కేంద్రాలకు భారీగా కోత

తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పాసులు ఉన్న ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.

రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అధికారి డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేతో పాటు ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేసిన విజయ్ పార్టీ తమిళన వెట్రి కజగం మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, విజయ్ గట్టి పోటీ ఇచ్చాడనీ మొన్నటి ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టీ నిలిచింది.

Tamil Nadu seals tighter faster results as counting centres consolidate to 62 in the state For May 4

రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016లో 81 కేంద్రాలు ఉండగా, 2026 నాటికి అది 62కి చేరింది. మౌలిక వసతులలో వచ్చిన మార్పులు లెక్కింపు కేంద్రాల సంఖ్య తగ్గిపోవడానికి కీలకమని అధికారులు చెబుతున్నారు. 2016లో 25 శాతానికి పైగా కేంద్రాలు పాఠశాల భవనాల్లో ఉండేవి. ఇవి పరిమిత నియోజకవర్గాలకు మాత్రమే సరిపోయేవి.

2021 నుండి కళాశాల ప్రాంగణాలను ఉపయోగించడానికి శ్రీకారం చుట్టింది ఈసీ. మెరుగైన స్థలం, మౌలిక వసతులు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కారణంగా ఒకే ప్రదేశంలో అనేక నియోజకవర్గాల లెక్కింపును నిర్వహించడం సాధ్యమవుతోంది. 2021లో లెక్కింపు కేంద్రాల సంఖ్య మొదట 70కి తగ్గింది. ఈ ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల సంఖ్య మరింత తగ్గింది.

జిల్లావారీగా పరిశీలిస్తే.. తిరువళ్ళూరు, విల్లుపురం, పెరంబలూరు, తేని, కన్యాకుమారి వంటి జిల్లాల్లో ఒక్కో లెక్కింపు కేంద్రం తగ్గిపోయింది. అదే సమయంలో తిరుచ్చి, వెల్లూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో రెండు కేంద్రాలు తగ్గాయి. కొన్ని జిల్లాల్లో లెక్కింపు కేంద్రాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2021తో పోలిస్తే కాళ్ళకురిచ్చి, చెంగల్‌పట్టు, మదురై జిల్లాల్లో ఒక్కో అదనపు లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇది ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం

ప్రస్తుత పంపిణీ ప్రకారం.. 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మదురైలో అత్యధికంగా అయిదు లెక్కింపు కేంద్రాలున్నాయి. తొమ్మిది నియోజకవర్గాలున్న కుడలూరు, 11 నియోజకవర్గాలున్న సేలం జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెంగల్‌పట్టు, తంజావూరు, విల్లుపురం, తిరువళ్ళూరు, చెన్నై వంటి జిల్లాలకు మూడు కేంద్రాలు కేటాయించారు. మిగిలిన చాలా జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య, లాజిస్టికల్ అవసరాలను బట్టి ఒకటి లేదా రెండు కేంద్రాలే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+