Vijay: విజయ్ కెరీర్ లో టాప్ 5 వివాదాలు ఇవేనా..??

దళపతి విజయ్ తమిళనాడులో కోట్లాదిమందికి ఆరాధ్య దైవం. తన కెరీర్ లో ఎన్నో మరపురాని చిత్రాల్ని ప్రేక్షకులకు అందించి వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అలాగే విజయ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజాసేవ చేస్తూ అందరివాడని పేరుపొందారు. అలాగే రెండేళ్ల క్రితం తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీ పెట్టి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. 108 స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇలా ఓ హీరో పార్టీ పెట్టి సీఎం సీటు వరకు రావడం గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి మహామహులకే సాధ్యం అయింది. అలాంటిది దాదాపు 50 ఏళ్ల తర్వాత విజయ్ వారి సరసన చేరడం ఆశ్చర్యకరం.

అలాగే ప్రతి హీరో కెరీర్ లోనూ అప్స్ అండ్ డౌన్స్, వివాదాలు, ఆరోపణలు, కేసులు ఉంటూనే ఉంటాయి. అలా విజయ్ కెరీర్ లోనూ అనేక వివాదాలు, ఆరోపణలు, కేసులు ఉన్నాయి. మరి విజయ్ కెరీర్ టాప్ 5 వివాదాలు చూస్తే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది విజయ్ తన భార్య విడాకుల వ్యవహారం.. విజయ్ తన భార్య సంగీత స్వర్ణలింగంతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంగీత 2026 ఫిబ్రవరిలో విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం ఆమె ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం. విజయ్ ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అందువల్లనే తాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో సంగీత బాంబ్ పేల్చారు.

ఇక రెండో వివాదం విజయ్- త్రిష మధ్య రిలేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు చర్చ జరుగుతూ వస్తోంది. విజయ్ ఎన్నికల బరిలోకి వచ్చాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఇక విజయ్- త్రిష కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అని చెబుతారు. వీరిద్దరూ గతంలో గిల్లి, కురువి, లియో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో త్రిష విజయ్ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే విజయ్ తన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్ తో వచ్చిన మనస్పర్థల కారణంగా వార్తల్లో నిలిచారు. విజయ్ అనుమతి లేకుండా అతని పేరుమీద రాజకీయ పార్టీని స్థాపించడానికి చంద్రశేఖర్ ప్రయత్నించిన నేపథ్యంలో.. తన పేరును లేదా ఫోటోలను ఏ రాజకీయ సంస్థ కోసం వాడకూడదని విజయ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు 2015 నుంచి 2020 మధ్య విజయ్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ముఖ్యంగా పులి, బిగిల్ చిత్రాల సమయంలో జరిగిన పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టారు.

Vijay Thalapathy Career Here Are the Top 5 Most Talked-About Controversies with Full Details Vijay

ఇక విజయ్ చివరి చిత్రం జన నాయగన్ ఈ ఏడాది జనవరి 12 న విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయంలో ఈ చిత్రం ఇప్పటికీ అడ్డంకులను ఎదుర్కొంటోంది. అంతేకాక ఈ సినిమా ఆన్ లైన్ లో లీక్ అవ్వడం కూడా పెద్ద దుమారం రేపింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇక ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. సింగిల్ గానే పోటీ చేసిన ఈ పార్టీ 108 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మిగతా పార్టీల మద్దతుతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+