ఈ చీమ కుడితే చావు తప్పదు! 20 రాష్ట్రాలపై దండయాత్ర

సాధారణంగా చీమ కుడితే కాసేపు మంట పుడుతుంది లేదా చిన్న దద్దురు వస్తుంది. కానీ, ఇప్పుడు ఒక అదృశ్య కీటకం అగ్రరాజ్యం అమెరికాను నిద్రలేకుండా చేస్తోంది. తూర్పు ఆసియా నుంచి చాపకింద నీరులా ప్రవేశించిన 'ఏషియన్ నీడిల్ యాంట్స్' (Asian Needle Ants) ఇప్పుడు ఏకంగా 20 అమెరికన్ రాష్ట్రాలను ఆక్రమించాయి. ఇవి కుడితే కలిగే నొప్పి మామూలుగా ఉండదని, అది నేరుగా ప్రాణాల మీదకు తెచ్చే అలెర్జీలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏషియన్ నీడిల్ యాంట్స్ పరిమాణంలో చాలా చిన్నవి, చూడటానికి ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇవి ఇతర చీమల్లా గుంపులుగా దిబ్బలు కట్టవు లేదా స్పష్టమైన దారులు ఏర్పరచుకోవు. మట్టిలో, కుళ్లిన కలపలో, రాలిన ఆకుల కింద నిశ్శబ్దంగా దాక్కుంటాయి. దీనివల్ల ప్రజలు వీటిని గమనించే లోపే కాటుకు గురవుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. ఈ చీమ కుట్టినప్పుడు శరీరంలోకి పదునైన సూదిని దించినంత విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి గంటల తరబడి బాధిస్తూనే ఉండటం దీని ప్రత్యేకత.

Asian Needle Ants Invasion in US Why These Tiny Insects Are Becoming a Deadly Threat to Humans
కంటికి కనిపించని మృత్యుపాశం: మనం తాగే నీళ్లలో 'ట్రోజన్ హార్స్'?
కంటికి కనిపించని మృత్యుపాశం: మనం తాగే నీళ్లలో 'ట్రోజన్ హార్స్'?

అలెర్జీ వస్తే అంతే సంగతులు!

చాలా సందర్భాల్లో ఈ చీమ కాటు వల్ల ఎరుపుదనం, వాపు మాత్రమే వచ్చినప్పటికీ.. అలెర్జీ ప్రతిచర్యలు (Allergic Reactions) ఉన్నవారికి మాత్రం ఇది మృత్యుపాశంలా మారుతోంది. సున్నితమైన చర్మం లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ చీమ విషం వల్ల ఊపిరి ఆడకపోవడం, గొంతు వాపు, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సరైన సమయంలో వైద్య సహాయం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని 'ది న్యూయార్క్ పోస్ట్' తన నివేదికలో హెచ్చరించింది. 20వ శతాబ్దంలోనే ఇవి అమెరికాలో అడుగుపెట్టినప్పటికీ, గత ఐదేళ్లుగా వీటి విస్తరణ వేగం ఊహించని రీతిలో పెరిగింది.

మునగ గింజల పవర్ చూశారా?
మునగ గింజల పవర్ చూశారా?

పర్యావరణానికీ ముప్పే!

ఈ ఆసియా చీమల దండయాత్ర కేవలం మనుషులకే కాదు, స్థానిక పర్యావరణ వ్యవస్థకు కూడా పెను ముప్పుగా మారింది. ఇవి స్థానిక జాతి చీమలను తరిమికొడుతూ, నేల ఆరోగ్యాన్ని కాపాడే ఇతర కీటకాలను అంతం చేస్తున్నాయి. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో ఇవి ఇప్పటికే పాగా వేశాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పుడు అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. తోటపని చేసేటప్పుడు లేదా అడవి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతి తొడుగులు, బూట్లు ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, చిన్న కీటకమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఈ 'సూది చీమలు' ప్రాణాలకే ఎసరు పెట్టేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+