దేశంలో సంచలనం.. ఇద్దరు మాజీ మంత్రులకు మరణ శిక్ష
చైనాలో రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. అక్కడ ప్రతికాస్వేచ్ఛ అసలు ఉండదు. అలాగే ప్రజలు, ప్రజా ప్రతినిధులు చాలా క్రమశిక్షణగా ఉంటారు. చిన్నతనం నుంచే పిల్లలకు కూడా అలాంటి క్రమశిక్షణను అలవాటు చేస్తుంటారు. చైనాలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా, అవినీతికి పాల్పడినా కఠినమైన శిక్షలు ఉంటాయి. తాజాగా చైనాలో సంచలనం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణ శిక్ష విధించింది అక్కడి మిలిటరీ కోర్టు.
చైనాకు చెందిన ఇద్దరు మాజీ రక్షణ మంత్రులైన వీ ఫెంగ్ లీ, లీ షాంగ్ ఫు లు భారీగా అవినీతికి పాల్పడినట్లు తేలింది. చైనా అధ్యక్షుడు షీ జెన్ పింగ్ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలిటరీ కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వీళ్లిద్దరు నేతలు తమ సర్వీస్ లో అధికంగా లంచాలు తీసుకున్నట్లు అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.

అయితే చైనాలోని చట్టాల ప్రకారం ఈ ఇద్దరు మాజీ మంత్రులకు టూ ఇయర్ రిప్రీవ్ తో కూడిన మరణశిక్ష విధించారు. చైనా చట్టాల ప్రకారం ఈ రెండేళ్లలో సత్ప్రవర్తనతో ఉంటే ఈ శిక్షను జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంటుంది. ఇక చైనా మిసైల్ ప్రోగ్రామ్ లో భాగంగా జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో వీరిద్దరూ 2024 లోనే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు. తమ పదవులను అడ్డం పెట్టకుని వీ ఫెంగ్ లీ, లీ షాంగ్ ఫు లు భారీగా ప్రభుత్వ సొమ్మును దారి మరల్చినట్లు విచారణలో తేలింది. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జెన్ పింగ్ చైనా మిలిటరీలో భారీ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ శిక్షలు పడినట్లు స్పష్టం అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త చైనా వ్యాప్తంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications