పాకిస్థాన్‌ చేతుల్లోకి చైనా "బ్రహ్మాస్త్రం".. భారత్‌ కు బిగ్ షాక్..!!

భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ప్రమాదమే.. భారత్- చైనా మధ్య ఆక్ సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ తో భారత్ కు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే ఆ దేశంపై పలు కఠనమైన ఆంక్షలను విధించింది. దాంతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో పాకిస్థాన్ చైనాపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పై పాకిస్థాన్ ప్రయోగించిన అనేక డ్రోన్ లు, క్షిపణులు చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసినవే.. ఈ మేరకు భారత్ కు రష్యా ఎలాగైతే ఆయుధాలను సరఫరా చేస్తుందో.. అలాగే పాకిస్థాన్ కు చైనా అదే విధంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తోంది.

అయితే చైనా తన అత్యాధునిక జే-35 ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కు అందించేందుకు సిద్ధం అవుతోంది. చైనా ఇటీవల తన అత్యాధునిక జే-35AE యుద్ధ విమానాన్ని తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. ఈ మేరకు అంతర్జాతీయ అమ్మకాలకు వాటిని సిద్ధం చేసింది. అయితే పాకిస్థాన్ ఆ అత్యాధునిక యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు 40 యూనిట్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

China Set to Supply Advanced J-35 Stealth Fighter Jets to Pakistan Sparks Major Concern in India

గగనతలంలో పాకిస్థాన్ పై భారత్ కు పైచేయి ఉంది. భారత్ వద్ద రాఫేల్, సుఖోయ్ యుద్ధవ విమానాలు ఉన్నాయి. అయితే చైనా పాకిస్థాన్ కు ఐదో తరం జే-35 స్టెల్త్ యుద్ధ విమానాలను అందిస్తే భారత్ కు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇక అటు పాకిస్థాన్, ఇటు చైనా రెండూ ఐదోతరం యుద్ధ విమానాలను కలిగి ఉండటం వల్ల భారత్ సరిహద్దుల్లో సవాళ్లు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఇటీవల సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐదోతరం యుద్ధ విమానాల అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+