వారి గ్రీన్ కార్డులు అవుట్

అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతున్న కీలక సమయంలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనూహ్యంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల బంధువుల గ్రీన్ కార్డ్‌లను రద్దు చేసింది. వారిని అరెస్టు చేసింది. కటకటాల వెనక్కి నెట్టింది. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతించే గ్రీన్ కార్డులను రద్దు చేయడం పట్ల అటు ఇరాన్ ఘాటుగా స్పందించింది.

ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం.. మరింత ఆజ్యం పోసినట్టయింది. విదేశీ పౌరులు తమ దేశంలో శాశ్వతంగా నివసించడానికి, చట్టబద్ధంగా పని చేయడానికి ఉద్దేశించింది ఈ గ్రీన్ కార్డ్. అమెరికా పౌరసత్వం లేనప్పటికీ- దాని వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అందుతాయి. దీర్ఘకాల నివాసానికి పూర్తి చట్టబద్ధతను కల్పిస్తుంది.

Iran linked Families loses Green Card as part of broader security crackdown facing deportation

ఈసారి అమెరికా విదేశాంగ శాఖ ముగ్గురు అధికారుల గ్రీన్ కార్డ్‌లను రద్దు చేసింది. వీరు ఇరాన్‌లో జన్మించినప్పటికీ చాలా కాలంగా చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్నారు. ఈ ముగ్గురిలో లాస్ ఏంజిల్స్ శివార్లలో ఓ స్కూల్ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తోన్న సయ్యద్ ఈసా హష్మీ కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు భార్య, కుమారుడి గ్రీన్ కార్డ్‌లు కూడా రద్దయ్యాయి.

సయ్యద్ హష్మీ, ఆయన కుటుంబానికి గతంలో కేటాయించిన గ్రీన్ కార్డులను రద్దు చేయడానికి గల ప్రధాన కారణం.. తల్లి మసూమ్ ఎబ్టెకార్. 1979లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన వారి తరపున ఆమె ప్రతినిధిగా వ్యవహరించారు. తర్వాత ఇరాన్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఈ కారణంగానే హాష్మీని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్‌లో పొందుపరిచారు. ఇలాంటి చర్యలు జరగడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు. ఇటీవలే ఇరాన్ కు చెందిన కొందరు ప్రముఖుల కుటుంబ సభ్యుల గ్రీన్ కార్డులను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇరాన్ జనరల్ ఖాసిమ్ సులేమానీ మేనకోడలు, కుమార్తె గ్రీన్ కార్డ్‌లు రద్దయ్యాయి ఇదివరకు. సులేమానీ 2020 జనవరిలో బాగ్దాద్‌లో జరిగిన అమెరికా దాడిలో మరణించిన విషయం తెలిసిందే. కాగా గ్రీన్ కార్డులు రద్దయిన వెంటనే ఆ ముగ్గురిని కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని త్వరలోనే అమెరికా నుండి వెనక్కి ఇరాన్‌కు పంపనున్నారు. సంవత్సరాల తరబడి అమెరికాలో నివసిస్తోన్న వారికి ఎదురుదెబ్బగా భావిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+