రేపటి నుండి విద్యా వారోత్సవాలు.. వారం రోజుల ప్రణాళిక ఇదే!

తెలంగాణా ప్రభుత్వం సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా మే 11 నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు రోజు వారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

విద్యా వారోత్సవాలకు ప్రత్యేకంగా రూ. 15 లక్షల నిధులు మంజూరు

ఇందులో హెచ్ఎంలు, ఎంఈఓ లు, ఉపాధ్యాయులను, ప్రతినిధులను,ఇతర శాఖ అధికారులను భాగస్వామ్యం చేయనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రభుత్వం రూ. 15 లక్షల నిధులు మంజూరు చేశారు. మే 11న మండలానికి ఒక పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. వారి విద్యా నైపుణ్యాలు మెరుగుపరిచేలా, ఆటపాటలతో శిబిరాలు నిర్వహిస్తారు. అలాగే జిల్లాకో కస్తూర్బా గాంధీ విద్యాలయం సైతం బాలికలకు ప్రత్యేకంగా వేసవి శిబిరాలు ప్రారంభించనున్నారు.

The Telangana govt is set to organize Education Week celebrations to strengthen the govt schools

షెడ్యూల్ ఇలా

మే 12 వ తేదీన పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులను సన్నద్ధం చేసేలా శిబిరాలు ప్రారంభిస్తారు. సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యే వరకు రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులను బడికి రప్పించేలా చర్యలు తీసుకుంటారు. మే 13 న సర్పంచులతో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి విద్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ప్రజల భాగస్వామ్యం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలను నిర్వహిస్తారు.


ప్రభుత్వ స్కూల్స్ లో ప్రవేశాలు పెంచేలా కార్యక్రమాలు

మే 14న ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సర్కారు బడిలో ప్రవేశాలు గణనీయంగా పెంచేలా చేస్తారు. మే 15న పాఠశాలల్లో గ్రంథాలయ దినోత్సవం చేపట్టి,వాటి ఉపయోగాలను విద్యార్థులకు వివరిస్తారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయ ఏర్పాటు, పుస్తక పఠనం, పుస్తక ప్రదర్శన చేపడతారు.

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రక సంస్కరణలు.. ఆ తరగతులకు సెమిస్టర్ విధానం?
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రక సంస్కరణలు.. ఆ తరగతులకు సెమిస్టర్ విధానం?

సాంస్కృతిక పోటీలు, వారం రోజులు ఫుల్ ఫోకస్

మే 16వ తేదీన ఆర్ట్, క్రాఫ్ట్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జవహర్ బాల భవన్ మండల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. చిత్రలేఖనం, హస్తకళ, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. మే 17న బాలల దినోత్సవo నిర్వహిస్తారు. విద్యార్థులలో సృజనాత్మక పెంపుకు దోహదం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. విద్య వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి రేపటి నుండి నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+